Home > క్రికెట్ > రెండో టెస్టులో టీమిండియా ఘన విజయం.. సిరీస్ సమం

రెండో టెస్టులో టీమిండియా ఘన విజయం.. సిరీస్ సమం

రెండో టెస్టులో టీమిండియా ఘన విజయం.. సిరీస్ సమం
X

సౌతాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో టీమిండియా ఘనవిజయం సాధించింది. 7 వికెట్ల తేడాతో సఫారి జట్టుపై గెలిపొంది సిరీస్ను 1-1తో సమం చేసింది. రెండు రోజుల్లోనే టెస్టు ముగియడం గమనార్హం. ఫస్ట్ ఇన్నింగ్స్ లో సఫారీ జట్టు 55 రన్స్ చేయగా.. టీమిండియా 153 పరుగులు చేసింది. ఇక రెండో ఇన్నింగ్స్లో సౌతాఫ్రికాను భారత బౌలర్లు 176 పరుగులకే కుప్ప కూల్చారు. సీనియర్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా 6 వికెట్లతో చెలరేగాడు. ముకేశ్ కుమార్ 2, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ చెరో వికెట్ పడగొట్టారు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్ లో ఓపెనర్ మార్క్రమ్ ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. సెంచరీతో (106, 103 బంతుల్లో, 17 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగి.. జట్టు 176 పరుగులు చేయడంలో కీలక పాత్ర పోషించాడు.

మార్క్రమ్ మినహా.. ఏ బ్యాటర్ కూడా చెప్పుకొదగ్గ స్కోర్ చేయలేకపోయారు. డీన్ ఎల్గర్ (12), డేవిడ్ బెడింగామ్ (11), మార్కో జాన్సన్ (11) మినహా ఏ ఒక్కరు కూడా రెండంకెల స్కోర్ చేయలేకపోయారు. 62 పరుగుల ఓవర్ నైట్ స్కోర్ వద్ద రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన సఫారీలు.. ఏ దశలోనూ ఇన్నింగ్స్ ను నిలబెట్టలేకపోయారు. టీమిండియా బౌలర్ల దాటికి క్రీజులో నిలబడలేకపోయారు. దీంతో లంచ్ బ్రేక్కు ముందే.. సౌతాఫ్రికా ఆలౌట్ అయింది. 79 పరుగుల ఈజీ టార్గెట్ను భారత్ 34.5 ఓవర్లలోనే చేధించింది. జైస్వాల్ 28, గిల్ 10, కోహ్లీ 12 రన్స్ కే ఔట్ అయ్యారు. అయితే రోహిత్ 17, అయ్యర్ 4 రన్స్ తో నాటౌట్ గా నిలిచి భారత్ను గెలిపించారు. దీంతో కేప్ టౌన్ లో తొలి టెస్ట్ విజయం సాధించిన ఆసియా జట్టుగా భారత్ నిలిచింది.


Updated : 4 Jan 2024 5:44 PM IST
Tags:    
Next Story
Share it
Top