ఆ రోజు హెల్మెట్‌ను నేలకేసి కొట్టి ఎక్కువ చేశాను : అవేశ్ ఖాన్
X
ఐపీఎల్ 2023లో ఎన్నో ఉత్కంఠ మ్యాచ్‌లు జరిగాయి. వాటిలో చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ ఒకటి. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో చివరి బంతికి లక్నో విజయం సాదించింది. ఆఖరి బంతికి లక్నో విజయానికి ఒక్క పరుగు అవసరం కాగా.. హర్షల్ వేసిన బంతిని అవేశ్ ఖాన్ టచ్ చేయలేకపోయాడు. కానీ బై రూపంలో పరుగు పూర్తి చేశాడు.
గెలుపు అనంతరం లక్నో ఆటగాళ్ల సంబరాలు అంబరానంటాయి. ఆవేశ్ ఖాన్ సెలబ్రేషన్ మరింత హెచ్చుమీరింది. చేతిలో హెల్మెట్ నేలకేసి కొట్టి సంబరాలు చేసుకున్నాడు. అప్పట్లో అతడి చర్య తీవ్ర చర్చనీయాంశమైంది. సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వచ్చాయి. మ్యాచ్ రిఫరీ కూడా ఆవేశ్ ఖాన్‌ను మందలించి వదిలివేశాడు.
అప్పటి ఘటనపై తాజాగా అవేశ్ ఖాన్ స్పందించాడు. ఆ రోజు అలా చేసినందుకు పశ్చాతాపం వ్యక్తం చేశాడు. "హెల్మెట్‌ను నేలకేసి కొట్టి తప్పు చేశాను. ఆ ఘటన ఘటన కాస్త ఎక్కువైంది. ఆ రోజు అలా చేయకుండా ఉండాల్సింది. అలా చేసినందుకు ఇప్పుడు బాధపడుతున్నా" అని తెలిపాడు. ఐపీఎల్ తాజా సీజన్‌లో అవేశ్ ఖాన్ మొత్తం 18 వికెట్లు సాదించాడు.
వచ్చే నెలలో భారత జట్టు వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనుంది. ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ జట్టులోకి వస్తానని అవేశ్ భావిస్తున్నాడు. అక్టోబరు 2022లో భారత్ తరఫున తన చివరి మ్యాచ్ ఆడాడు. భారత జట్టుకు ఆడిన తర్వాత మళ్లీ దేశవాళీ క్రికెట్‌లో ఆడడం మానసికంగా చాలా కలవరపెడుతుందని అవేశ్ తెలిపాడు.