Home > క్రికెట్ > కోహ్లీతో మామూలుగా ఉండదు.. జడేజా రాపిడ్ ఫైర్ ఆన్సర్స్

కోహ్లీతో మామూలుగా ఉండదు.. జడేజా రాపిడ్ ఫైర్ ఆన్సర్స్

కోహ్లీతో మామూలుగా ఉండదు.. జడేజా రాపిడ్ ఫైర్ ఆన్సర్స్
X

సెలబ్రిటీలతో రాపిడ్ ఫైర్ ఆడితే ఆ మజానే వేరు. ఇంటర్వ్యూవర్ వేసే తిక్క ప్రశ్నలకు.. వాళ్లచ్చే సమాధానాలు భలే ఇంట్రెస్టింగా ఉంటాయి. అందులో నుంచి కొత్త కొత్త విషయాలు బయటపడుతుంటాయి. అచ్చం అలాంటి ప్రశ్నలకే టీమిండియా స్టార్ క్రికెటర్ రవీంద్ర జడేజా ఆసక్తికర సమాధానాలు ఇచ్చాడు. ఓ స్పోర్ట్స్ ఛానెల్ ఇంటర్వ్యూలో అడిగిన రాపిడ్ ఫైర్ రౌండ్ లో ఈ విషయాలు బయటపడ్డాయి. టీమిండియా జట్టు ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటన పనుల్లో బిజీగా ఉన్న నేపథ్యంలో ఈ వీడియో బయటపడింది. అందులో అడిగిన ప్రశ్నలేంటంటే..

1. టీమిండియాలో ఎవరి గడ్డం బాగుంటుంది..?

నా గడ్డం కూడా బాగుంటుంది. కానీ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ లకు మంచి షేప్ లో గడ్డం ఉంటుంది.

2. టీంలో మోస్ట్ ఇంప్రూవ్డ్ ప్లేయర్ ఎవరు..?

పుజారా.. అప్పటికి, ఇప్పటికి అతని ఆటలో చాలా మార్పులు గమనించా.

3. మీలో జరిగిన మోస్ట్ ఫన్నీయెస్ట్ వాట్సాప్ ఫార్వర్డ్..?

ఇషాన్ కిషన్.. మా ప్రాక్టీస్ సెషన్ ను వీడియో తీసి, ఎంటర్ టైనింగ్ గా మార్చాడు.

4. టీమిండియాలో మోస్ట్ ఎనర్జిటిక్ అండ్ బెస్ట్ స్లెడ్జర్ ఎవరు..?

ఇంకెవరు.. విరాట్ కోహ్లీనే. అతను గేమ్ లో ఉంటే ఆ మజా వేరు. ప్రత్యర్థి ఏమన్నా.. తిరిగి అతని ముఖం మీదే ఇచ్చి పడేస్తాడు.

5. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ.. ఇద్దరిట్లో మోస్ట్ ఫన్నీ ఎవరు...

రోహిత్ శర్మ కూడా ఫన్నీనే. కానీ, కోహ్లీ బెస్ట్. వేరేవాళ్లను ఇమిటేట్ చేస్తూ ఆటపట్టిస్తుంటాడు.

6. డ్రెస్సింగ్ రూంలో డీజే ఎవరు..?

విరాట్.. అతని దగ్గర ప్రతీ ఒక్క ఆల్బమ్ ఉంటుంది. డ్రెస్సింగ్ రూంలోకి రాగానే మ్యూజిక్ పెట్టి ఎంజాయ్ చేస్తాడు.

7. ఎవరు యాక్టివ్ ఉంటారు. తొందరగా ఎవరు రిప్లే ఇస్తారు..?

యుజేంద్ర చాహల్.. అందరికీ ఫాస్ట్ గా రిప్లై ఇస్తుంటాడు.

8. టీమిండియాలో రీల్స్ చేసేది ఎవరు..?

ఇంకెవరు.. చాహల్, ధవన్. ఇద్దరు కలిస్తే ఇక అంతే..




Updated : 1 July 2023 5:41 PM IST
Tags:    
Next Story
Share it
Top