Home > క్రికెట్ > ఆస్ట్రేలియా బ్యాటర్ చేసిన పనికి అంతా షాక్.. వీడియో వైరల్

ఆస్ట్రేలియా బ్యాటర్ చేసిన పనికి అంతా షాక్.. వీడియో వైరల్

ఆస్ట్రేలియా బ్యాటర్ చేసిన పనికి అంతా షాక్.. వీడియో వైరల్
X

ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్ల మధ్య యాషెస్‌ టెస్ట్ సిరీస్ ఆసక్తికరంగా సాగుతోంది. రెండో టెస్ట్‌లో ఇరు జట్లు నువ్వానేనా అన్నట్టు తలపడుతున్నాయి. మొదటి మ్యాచ్‌లో విజయం సాధించిన ఆస్ట్రేలియా రెండో టెస్ట్ లోనూ తన ఫామ్‌ను కొనసాగిస్తోంది. కాగా..మ్యాచ్ లో భాగంగా ఆస్ట్రేలియా ఆటగాడు లబూషేన్ చేసిన ఓ పనికి అందరూ ఛీఛీ అంటున్నారు.

తొలి రోజు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో మార్నస్ లబుషేన్ క్రీజులో గార్డ్ సర్దుకుంటున్నాడు. ఈ సమయంలో అతడి నోటిలో ఉన్న చూయింగ్ గమ్ కింద పడింది. దాన్ని అలాగే వదిలేయకుండా వెంటనే.. క్రీజుపై పడ్డి చూయింగమ్‌ను తీసి లబుషేన్ మళ్లీ నోట్లో వేసుకున్నాడు. దానికి మట్టి అంటిందా లేదా అన్నది ఏమాత్రం ఆలోచించకుండా నోట్లో వేసేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. లబూషేన్ చేసిన పనికి అందరూ ఆశ్చర్యపడుతున్నారు. . స్టార్ ప్లేయర్ అయి ఉండి కూడా కింద పడ్డ చూయింగమ్‌ను తీసుకొని మళ్లీ నోట్లో వేసుకోవడం పట్ల నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. పిచ్ టేస్ట్ చూడడానికే అలా చేశాడని కొందరంటుంటే..అతని వద్ద ఒక్కటే చూయింగ్ గమ్ ఉందని మరికొందరు కామెంట్స్ చేశారు.





మ్యాచ్ విషయానికి కొస్తే మొదటి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియాకు 91 పరుగుల ఆధిక్యం లభించింది. ఆసీస్ తొలుత 416 పరుగులు చేయగా..ఇంగ్లండ్ 325 పరుగులకే అలౌట్ అయ్యింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో డకెట్ 98, హ్యారీ బ్రూక్ 50 పరుగులు చేశారు. ఆస్ట్రేలియే బౌలర్లలో స్టార్క్ 3, హాజిల్‌వుడ్ 2, హెడ్ 2, కమ్మిన్స్, లియాన్, గ్రీన్ ఒక్కో వికెట్ తీసుకున్నారు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ అనంతరం ఆస్ట్రేలియా తన రెండో ఇన్నింగ్స్‎ను కొనసాగిస్తోంది.




Updated : 30 Jun 2023 6:21 PM IST
Tags:    
Next Story
Share it
Top