Home > క్రికెట్ > Asia Cup 2023: ఆఫ్ఘనిస్తాన్ జట్టు ప్రకటన.. నిరాశలో కోహ్లీ ఫ్యాన్స్!

Asia Cup 2023: ఆఫ్ఘనిస్తాన్ జట్టు ప్రకటన.. నిరాశలో కోహ్లీ ఫ్యాన్స్!

Asia Cup 2023: ఆఫ్ఘనిస్తాన్ జట్టు ప్రకటన.. నిరాశలో కోహ్లీ ఫ్యాన్స్!
X

ఆసియా కప్ 2023 ఇవాళ్టినుంచి (ఆగస్ట్ 30) మొదలయింది. ఆతిథ్య పాకిస్తాన్, నేపాల్ మొదటి మ్యాచ్ ఆడుతున్నాయి. అన్ని జట్లు తమ టీంలను రెండు రోజుల క్రితమే ప్రకటించాయి. ఆఫ్ఘనిస్తాన్ కూడా ఆదివారం (ఆగస్ట్ 27) తమ 17 మందితో కూడిన జట్టును ప్రకటించింది. ప్రతీ జట్టు ఈ ఏడాది కప్పు కొట్టాలనే పట్టుదలతో ఉంది. టీమిండియా ఫేవరెట్ గా బరిలోకి దిగుతుంది. సూపర్ ఫామ్ లో ఉన్న విరాట్ కోహ్లీ.. ఈసారి కూడా అదరగొడతాడని ఆశిస్తున్నారు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు. దానికి కారణం మ్యాంగో మ్యాన్. అదే ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ నవీన్ ఉల్ హక్.





ఐపీఎల్ 2023లో లక్నోకు ఆడిన నవీన్.. బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీతో గొడవ పెట్టుకున్న సంగతి తెలిసిందే. అదీ కాక.. సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతూ గొడవను ఇంకా పెద్దది చేశాడు. దాంతో ఆగ్రహించిన ఫ్యాన్స్.. నవీన్ ఎక్కడ కనిపించినా ఎద్దేవా చేయడం మొదలుపెట్టారు. ఆసియా కప్, వరల్డ్ కప్ ల్లో నవీన్ ను కోహ్లీ చితక బాదుతుంటే చూడాలని ఆశపడ్డారు. తీరా చూస్తే.. ఆఫ్ఘనిస్తాన్ టీంలో నవీన్ కు చోటు దక్కలేదు. దీంతో విరాట్ ఫ్యాన్స్ నిరాశ పడుతున్నారు. అయినా వదలకుండా.. నవీన్ ను సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నారు. ఈసారి బతికి పోయాడు.. మరోసారి చూసుకుందామని కామెంట్ పెడుతున్నారు. నవీన్ కెరీర్ ముగిసిపోకుండా ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డ్ బలే ప్లాన్ చేసిందని చెప్తున్నారు. మిస్సింగ్ మ్యాంగో మ్యాన్, వేర్ ఈజ్ మ్యాంగ్ మ్యాన్ అంటూ పోస్ట్ లు పెడుతున్నారు.





Updated : 30 Aug 2023 4:54 PM IST
Tags:    
Next Story
Share it
Top