ఆసీస్ తొండాట.. వివాదంలో బెయిర్స్టో స్టంపౌట్..!
X
ఆస్ట్రేలియాతో ఏ జట్టు మ్యాచ్ ఆడినా.. అందులో ఏదో ఒక వివాదం జరుగుతుంది. ఆదివారం (జులై 2) జోరుగా సాగిన యాషెస్ సిరీస్ డే 5లో కూడా ఓ వివాదం నెలకొంది. లార్డ్స్ లో జరిగిన రెండో టెస్ట్ లో గెలుపు అవకాశాలు ఉన్న ఇంగ్లండ్ జట్టును.. బెయిర్ స్టో సంపౌట్ కొంప ముంచింది. 43 పరుగుల తేడాతో ఓడిపోయేలా చేసింది. ఈ క్రమంలో గెలుపు కోసం ఆసీస్ అడ్డదారులు తొక్కిందని, క్రీడా స్పూర్తికి విరుద్ధంగా ప్రవర్తించిందని క్రికెట్ విశ్లేషకులు, అభిమానులు ఫైర్ అవుతున్నారు. ఆసీస్ అన్యాయాన్ని అంపైర్లు ఎలా సమర్థిస్తారని ఆరోపిస్తున్నారు. మరికొందరు రూల్స్ ప్రకారం అది కచ్చితంగా ఔట్.. దానికి అంపైర్ ను తిట్టడం దేనికని సమర్థిస్తున్నారు.
చివరి రోజు ఆటలో గ్రీన్ వేసిన షార్ట్ బౌన్సర్ కు తప్పుకున్న బెయిర్ స్టో.. తన కాలును క్రీజులో కొద్దిసేపు ఉంచి బయటివచ్చాడు. అంతలోనే ఆసీస్ కీపర్ ఆలెక్స్ క్యారీ బాల్ ను స్టంప్స్ కు కొడతాడు. వెంటనే ఆసీస్ బౌలర్, ఫీల్డర్స్ ఔట్ అంటూ అప్పీల్ చేశారు. దాంతో అసలు ఏం జరుగుతుందో అర్థం కాని బెయిర్ స్టో బిత్తరపోయి చూస్తుంటాడు. ఫీల్డ్ అంపైర్ కూడా దాన్ని ఔట్ అని డిక్లేర్ చేస్తాడు. దాతో బెయిర్ స్టో అసహనంగా క్రీజ్ వదిలి వెళ్లిపోయాడు. ఈ వివాదంపై సోషల్ మీడియాలో ఆసీస్ ను ట్రోల్ చేస్తున్నారు. గల్లీ క్రికెట్ లో మాదిరి తొండాట ఆడి మీరేం సాధింస్తారని కామెంట్స్ పెడుతున్నారు.
BAIRSTOW IS RUN-OUT.
— Johns. (@CricCrazyJohns) July 2, 2023
WHAT A MOMENT IN ASHES.pic.twitter.com/Dw4EFpt0x3