వరల్డ్ కప్ షెడ్యూల్ రిలీజ్.. ఉప్పల్లో మూడు మ్యాచులు
X
ఐసీసీ వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదలైంది. ఆక్టోబర్ 5న అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య జరగనున్న మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీ ప్రారంభమవుతుంది. నవంబర్ 12న ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ మధ్య జరిగే ఆఖరి గ్రూప్ మ్యాచులతో లీగ్ స్టేజ్ ముగుస్తుంది. ముంబైలో నవంబర్ 15న మొదటి సెమీ ఫైనల్, నవంబర్ 16న కోల్‌కత్తాలో రెండో సెమీ ఫైనల్ జరుగుతుంది. నవంబర్ 19న అహ్మదాబాద్‌లో జరిగే ఫైనల్‌తో వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి ఎండ్ కార్డ్ పడుతుంది. ఫైనల్ మ్యాచ్‌కి రిజర్వు డేగా నవంబర్ 20ని కేటాయించారు.
ఈ టోర్నమెంట్లో ఇండియా తన తొలి మ్యాచ్ను అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఆ తర్వాత అక్టోబర్ 11న ఆఫ్ఘానిస్థాన్, అక్టోబర్ 15న పాకిస్తాన్, అక్టోబర్ 19న బంగ్లాదేశ్, అక్టోబర్ 22న న్యూజిలాండ్, అక్టోబర్ 29న లక్నోలో ఇంగ్లాండ్‌తో మ్యాచ్ ఆడుతుంది. నవంబర్ 11న క్వాలిఫైర్ 1 తో టీమిండియా తన చివర్ లీగ్ మ్యాచ్ ఆడుతుంది. హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో మూడు మ్యాచులు జరగనున్నాయి. అయితే టీమిండియాకు సంబంధించిన ఒక్క మ్యాచ్ కూడా ఉప్పల్ స్టేడియంలో లేదు. హైదరాబాద్, వైజాగ్ మినహా అన్ని ప్రధాన నగరాల్లో ఇండియా మ్యాచ్లు జరగుతుండడం గమనార్హం.
GET YOUR CALENDARS READY! 🗓️🏆
— ICC (@ICC) June 27, 2023
The ICC Men's @cricketworldcup 2023 schedule is out now ⬇️#CWC23https://t.co/j62Erj3d2c