Home > క్రికెట్ > పాట్ కమ్మిన్స్ గెలుపు గర్వం.. టీమిండియాపై నోరు జారాడు

పాట్ కమ్మిన్స్ గెలుపు గర్వం.. టీమిండియాపై నోరు జారాడు

పాట్ కమ్మిన్స్ గెలుపు గర్వం.. టీమిండియాపై నోరు జారాడు
X

మొదటి రోజు నుంచి కూల్ గా జరిగిన డబ్ల్యూటీసీ మ్యాచ్.. చివరికి వివాదాస్పదం అయింది. బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలు, గిల్ క్యాచ్ పై థార్డ్ అంపైర్ నిర్ణయం లాంటి ఘటనలతో టీమిండియా ఫ్యాన్స్ అసంతృప్తిగా ఉన్నారు. అవికాదన్నట్లు 9 ఏళ్లనుంచి భారత్ కు ఐసీసీ ట్రోఫీ దక్కలేదనే కోపం. వీటన్నింటికీ తోడు ఆసీస్ కెప్టెన్.. భారత్ కెప్టెన్ రోహిత్ శర్మపై చేసిన వ్యాఖ్యలతో ఆజ్యం పోసినట్లయింది. ఫైనల్ ముగిసిన తర్వాత మీడియా సమావేశంలో మాట్లాడిన రోహిత్ శర్మ ‘టెస్ట్ ఛాంపియన్ షిప్ ను ఒక్క మ్యాచ్ తో ముగించడం సరికాదు. ప్రత్యర్థి జట్టు బలాబలాలు తెలుసుకోవడానికి టైం పడుతుంది. అందుకు కనీసం మూడు మ్యాచ్ ల సిరీస్ అయినా ఆడించాల్సి ఉంటుంది’ అంటూ ఐసీసీపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. గతంలో కూడా కోహ్లీ ఇదేవిధమైన వ్యాఖ్యలు చేశాడు.

ఈ మాటలకు కౌంటర్ ఇచ్చిన పాట్ కమ్మిన్స్.. ‘ఇప్పటికే మేము డబ్ల్యూటీసీ ఫైనల్ గెలిచాం. ఈ ఫైనల్ కోసం 3 మ్యాచ్ లు కాకపోతే.. 16 మ్యాచులైనా ఆడతాం. అయితే, ఒలంపిక్స్ మెడల్ సాధించాలన్నా ఆటగాళ్లు ఒకే మ్యాచ్ ఆడతారన్నది గుర్తుపెట్టుకోవాలి’ అంటూ వ్యాఖ్యానించాడు. ఈ మాటల పట్ల భారత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇవి పొగరుతో అన్న మాటలని కామెంట్స్ పెడుతున్నారు.

ఏదేమైనా పాట్ కమ్మిన్స్ చేసిన వ్యాఖ్యలు కాస్త శృతిమించాయి. జట్టు సారథిగా తమ అభిప్రాయాలు చెప్పుకునే స్వేచ్ఛ ప్రతి ఆటగాడికి ఉంటుంది. దాన్ని గౌరవించడం ప్రత్యర్థి కెప్టెన్లు నేర్చుకోవాలని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు భారత అభిమానులు కూడా కమ్మిన్స్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయితే, ఈ కామెంట్స్ పై పాట్ కమ్మిన్స్ మరోసారి వివరన ఇస్తాడో లేదో చూడాలి.







Updated : 12 Jun 2023 8:07 PM IST
Tags:    
Next Story
Share it
Top