Home > క్రికెట్ > పాపం పృథ్వీ షా.. రెండో గర్ల్ఫ్రెండ్తోనూ బ్రేకప్..! ఆ చిన్న కారణంతో..

పాపం పృథ్వీ షా.. రెండో గర్ల్ఫ్రెండ్తోనూ బ్రేకప్..! ఆ చిన్న కారణంతో..

పాపం పృథ్వీ షా.. రెండో గర్ల్ఫ్రెండ్తోనూ బ్రేకప్..! ఆ చిన్న కారణంతో..
X

భారత జట్టు యంగ్ ప్లేయర్ పృథ్వీ షా మరోసారి వార్తల్లో నిలిచారు. పాపం పృథ్వీ షా.. చాలా కాలంగా మోడల్ నిధి తపాడియాతో డేటింగ్ లో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. చట్టాపట్టాలు వేసుకుని తిరిగిన ఫొటోలు వైరల్ అయ్యాయి. ఇటీవల జరిగిన కేన్స్ ఫెస్టివల్ లో కూడా ఈ ఇద్దరు సందడి చేశారు. తాజాగా పాపం పృథ్వీ షా తను పెళ్లి చేసుకోబోయేది ఈ అమ్మాయినే అంటూ సోషల్ మీడియాలో స్టేటస్ లు పెట్టి, వెంటనే డిలీట్ చేశాడు. నిధి కూడా తన ఇన్ స్టాలో బ్రేకప్ సాంగ్ పోస్ట్ చేసింది.





కొంతకాలంగా ప్రేమలో ఉన్న వీళ్లిద్దరు.. తాజాగా ఆమెకు బ్రేకప్ చెప్పినట్లు తెలుస్తోంది. ఆ వార్త నిజం అన్నట్లు.. ఇన్ స్టాగ్రామ్ లో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకున్నారు. దీంతో వీళ్లిద్దరి బ్రేకప్ వార్తల్లో బలం చేకూరింది. ఇద్దరూ విడిపోయేందుకు సిద్ధమైనట్లు సమాచారం. అండర్ 15 నుంచి గొప్పగా రాణిస్తూ.. అందరి ప్రశంసలు అందుకున్న పృథ్వీ షా.. ప్రస్తుతం ఆటల్లో కన్నా వివాదాలు, ఇతర వార్తల్లోనూ ఎక్కువగా నిలుస్తన్నాడు. అనవసరంగా తన కెరీర్ ను నాశనం చేసుకుంటున్నాడని నెటిజన్స్ ఫీల్ అవుతున్నారు. మరికొందరు పృథ్వీ షాకు మద్దతునిస్తూ.. ఫామ్ లో ఉండి, కెరీర్ బాగుపడుతుంది అనుకున్నప్పుడు నిధి తనతో ఉంది. ప్రస్తుతం పృథ్వీ షా కెరీర్ క్వశ్చమార్క్ గా మారింది. జట్టులో సెలక్ట్ అవుతాడో లేదో తెలియని పరిస్థితి ఉంది. ఈ కారణంతోనే నిధి.. బ్రేకప్ చెప్పిందని అంటున్నారు.






Updated : 8 July 2023 9:31 AM IST
Tags:    
Next Story
Share it
Top