ట్రోఫీకి కుడివైపు రోహిత్.. టీమిండియాదే కప్ అంటున్న ఫ్యాన్స్..
X
వరల్డ్ కప్ ట్రోఫీకి టీమిండియా అడుగు దూరంలోనే ఉంది. ఆదివారం జరిగే మహాసంగ్రామంలో కప్ ఎవరిదో తేలనుంది. 20 ఏళ్ల తర్వాత ఆసీస్ - భారత్ జట్లు వరల్డ్‌కప్ ఫైనల్‌లో తలపడుతున్నాయి. ఈ క్రమంలో ఆసీస్పై ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా పట్టుదలతో ఉంది. 2003 వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియాపై ఆసీస్ గెలిపొంది కప్ కొట్టింది. దీంతో ఎలాగైన ఈ సారి కప్ కొట్టి సత్తా చాటాలని రోహిత్ సేన భావిస్తోంది.
వరల్డ్‌కప్ ఫైనల్ నేపథ్యంలో ఓ పాత సెంటిమెంట్‌ను ఫ్యాన్స్ తెరపైకి తెచ్చారు. ఈ సారి టీమిండియా కచ్చితంగా గెలుస్తుందని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఫైనల్ మ్యాచ్‌కు ముందు టీమిండియా - ఆస్ట్రేలియా కెప్టెన్లు రోహిత్ శర్మ, కమ్మిన్స్ అహ్మాదాబాద్‌లోని అదాలజ్ స్టెప్‌వెల్ వద్ద ట్రోఫీతో ఫొటో షూట్ చేశారు. దీంట్లో ట్రోఫీకి కుడివైపు రోహిత్ శర్మ ఉండగా.. ఎడమ వైపు కమ్మిన్స్ ఉన్నారు. అయితే రోహిత్ కుడివైపు ఉండడంతో టీమిండియాదే వరల్డ్‌కప్ అని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు.
ఫ్యాన్స్ ఇలా ఫిక్స్ అవడానికి ఓ కారణం ఉంది. గత మూడు వరల్డ్‌కప్ టోర్నీల్లో కూడివైపు ఉన్న కెప్టెన్ల టీంలే వరల్డ్ కప్ను గెలుచుకున్నాయి. 2011 వరల్డ్‌కప్ ఫైనల్ సమయంలో ట్రోఫీతో కెప్టెన్ల ఫొటో షూట్ సందర్భంగా ధోనీ కుడి వైపే ఉన్నారు. అప్పుడు ప్రపంచకప్‌ను టీమిండియా సొంతం చేసుకుంది. 2015 ప్రపంచకప్‌లోనూ ఇలాగే జరిగింది. ట్రోఫీతో ఫోజులిచ్చేటప్పుడు ఆస్ట్రేలియా కెప్టెన్ మైఖేల్ క్లార్క్ కుడివైపే ఉండగా.. ఆసీస్ కప్ కొట్టింది. ఇక 2019 వరల్డ్‌కప్ ఫైనల్ సమయంలోనూ ఇంగ్లండ్ కెప్టెన్ మోర్గాన్ ట్రోఫీకి కుడివైపే ఉండగా.. ట్రోఫీని ఇంగ్లాండ్ గెలిచింది.
ఇప్పుడు కూడా రోహిత్ కుడి వైపే ఉండడంతో టీమిండియా గెలుపు ఖాయమని ఫ్యాన్స్ ఫిక్సయ్యారు.