లగ్జరీ కారు కొన్న సచిన్.. రేటు ఎంతంటే..?
X
టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండ్కూలర్‌కు కార్ల మీద ఉన్న ఇష్టం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇప్పటికే ఆయన దగ్గర ఎన్నో కార్లున్నాయి. వాటిలో 8 లగ్జరీ కార్లున్నాయి. తాజాగా సచిన్ గ్యారేజీలోకి మరో విలాసవంతమైన కారు చేరింది. లాంబోర్ఘిని లేటెస్ట్ టాప్ వేరియెంట్ ఉరుస్ ఎస్ ఎగ్జరీ కారును సచిన్ కొన్నాడు. ఈ కారు ఎక్స్ షోరూమ్ ధర రూ 4.18 కోట్లు. సచిన్ కొన్న కారు ఉరుస్ లైనప్‌లో వచ్చిన రెండవ మోడల్. ఇది ఉరుస్ పెర్ఫార్మంట్ మోడల్ కన్నా దీని రేటు తక్కువ. ధర. ఇక సచిన్ టెండూల్కర్ కొత్త లంబోర్ఘిని కారులో ప్రయాణిస్తున్న వీడియోను సీఎస్ 12 వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ షేర్ చేసింది.
సచిన్ టెండూల్కర్ ప్రముఖ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూకు 2012 నుంచి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. దీంతో అతడి గ్యారేజీలో చాలానే బీఎండబ్ల్యూ కార్లు ఉన్నాయి. బీఎండబ్ల్యూ 7 సిరీస్, బీఎండబ్ల్యూ ఎక్స్5 ఎమ్, బీఎండబ్ల్యూ ఐ8, బీఎండబ్ల్యూ 5 సిరీస్ తదితర లగ్జరీ కార్లు ఆయన దగ్గర ఉన్నాయి. తన మొదటి కారు అయిన మారుతి 800 అంటే సచిన్కు ఎంతో ఇష్టం. 1989లో కొన్న ఆ కారును ఆయన ఇప్పటికీ తన గ్యారేజీలో భద్రంగా పెట్టుకున్నారు.