Home > క్రికెట్ > పుట్టినరోజునాడు కీలక ప్రకటన చేస్తానంటున్న గంగూలీ

పుట్టినరోజునాడు కీలక ప్రకటన చేస్తానంటున్న గంగూలీ

పుట్టినరోజునాడు కీలక ప్రకటన చేస్తానంటున్న గంగూలీ
X

టీమిండియా మాజీ ఆటగాడు, దాదా సౌరవ్ గంగూలీ తన 51 వ పుట్టిన రోజు నాడు కీకల ప్రకటన చేయనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా దాదానే తన ఫేస్ బుక్ ప్రొఫైల్ లో తెలియజేశాడు. తాను చెప్పే విషయం కోసం వెయిట్ చేయండి అంటూ క్యాప్షన్ కూడా పెట్టాడు.

బీసీసీఐ బాస్ గా రిజైన్ చేసిన తర్వాత గంగూలీ ఢిట్లీ క్యాపిటల్స్కు డైరెక్టర్ ఆఫ్ ఆపరేషన్స్ గా విధులు నిర్వహిస్తున్నాడు. ఇప్పుడు సడెన్ తాను ఒకటి చెప్పబోతున్నాను అని పోస్ట్ పెట్టేసరికి ఇది కాస్తా నెట్ లో వైరల్ అయిపోయింది. దాదా ఏం చెబుతాడా, ఏదైనా శుబవార్తా అంటూ తెగ చర్చించేసుకుంటున్నారు నెటిజన్లు. గంగూలి గురించి తెలిసివారు అయితే అతను రాజకీయాల్లోకి వస్తాడంటూ జోస్యాలు చెబుతున్నారు. అంతకు ముందు గంగూలీ ఇంటికి బీజెపీ నాయకులు వెళ్ళడం చర్చలు జరగడం ద్వారా అదే జరగొచ్చని గెస్ చేస్తున్నారు. మరి గంగూలీ ఏం జేస్తాడో తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.





టీమిండియాను సక్సెస్ ఫుల్ గా ముందుకు నడిపించి జట్టుకు ఎన్నో విజయాలను అందించిన గంగూలీ ఢిల్లీ క్యాపిటల్స్ కు మాత్రం ఏం చేయలేకపోయాడు. ఈ సారి ఐఫీఎల్ లో ఢిల్లీ ఘోరంగా వైఫల్యం చెందింది. దాదా మ్యాజిక్ ఏం పనిచేయలేకపోయింది. దీంతో ఆ జట్టు చివరి స్థానంలో నిలిచింది.


Updated : 7 July 2023 1:02 PM IST
Tags:    
Next Story
Share it
Top