శ్రీలంక వణికినా.. వరల్డ్ కప్కు అర్హత సాధించింది
X
వన్డే వరల్డ్ కప్ కు శ్రీలంక దాదాపు అర్హత సాధించినట్లే. క్వాలిఫయింగ్ మ్యాచుల్లో సత్తాచాటిన ప్లేయర్లు.. జట్టును ఛాంపియన్ షిప్ కు దాదాపు తీసుకొచ్చారు. అయితే, ఇవాళ నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్ లో మాత్రం దాదాపు ఓడినంత పని అయింది. 21 పరుగుల తేడాతో విజయం సాధించినప్పటికీ నెదర్లాండ్స్ బౌలర్ల దాటికి చేతులెత్తేసింది. మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 48 ఓవర్లో 213 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. ఆల్ రౌండర్ ధనుంజయ డి సెల్వ (93, 111 బంతుల్లో) రాణించడంతో శ్రీలంక ఆమాత్రం స్కోర్ చేయగలిగింది.
214 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ పోరాడి ఓడింది. శ్రీలంక బౌలర్ల సమిష్టి కృషితో నెదర్లాండ్స్ బ్యాట్స్ మెన్ ను 40 ఓవర్లకే ఆలౌట్ చేశారు. దీంతో లంక వరల్డ్ కప్ బెర్త్ ఖరారు అయింది. ఇంకా ఒక్క మ్యాచ్ గెలిస్తే వరల్డ్ కప్ కు అర్హత సాధించిన మొదటి జట్టుగా నిలుస్తుంది. శ్రీలంక తర్వాత జింబాబ్వేకు క్వాలిఫై అవకాశాలు చాలా ఉన్నాయి. రెండు సార్లు ట్రోఫీ సాధించిన వెస్టిండీస్.. ఈసారి క్వాలిఫై అవడం చాలా కష్టం.