IND vs PAK: రెచ్చిపోయిన పాక్ బౌలర్లు.. చుక్కలు చూపించిన ఇషాన్, హార్దిక్
X
ఆసియా కప్ లో డెబ్యూ మ్యాచ్. తోటి టాప్ ఆర్డర్ బ్యాటర్లంతా వెంటవెంటనే ఓట్ అయ్యారు. ప్రత్యర్థి బౌలింగ్ తో బెంబేలెత్తిస్తున్నారు. జట్టుపై ఫుల్ ప్రెజర్. అప్పుడే క్రీజ్ లోకి వచ్చాడు. ఇషాన్ కిషన్. వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాతో కలిసి పాకిస్తాన్ బౌలర్లకు చుక్కులు చూపించాడు. ఏ మాత్రం బెరుకు లేకుండా సిక్సర్లు ఫోర్లు బాదుతూ.. పాక్ కు చెమటలు పట్టించాడు. హార్దిక్ పాండ్యా కూడా ఏ మాత్రం తగ్గకుండా పాక్ బౌలర్లను ఒక ఆట ఆడుకున్నారు. పల్లెకెలె వేదికపై జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. పదోవర్లలో మూడు కీలక వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ రోహిత్ శర్మ (11, 22 బంతుల్లో), విరాట్ కోహ్లీ (4, 32 బంతుల్లో), శ్రేయస్ అయ్యర్ (14, 9 బంతుల్లో) త్వరగా ఔట్ అయ్యారు. ఓపెనర్ గిల్ కూడా (10, 34 బంతుల్లో) దారుణంగా ఫెయిల్ అయ్యాడు. దీంతో భారత్ 48.5 ఓవర్లలో 266 పరుగులకు ఆలౌట్ అయింది.
ఇషాన్, హార్దిక్ షో:
బీకర బౌలింగ్ తో రెచ్చిపోతున్న పాక్ బౌలర్లపై ఇషాన్ కిషన్ (82, 81 బంతుల్లో), హార్దిక్ పాండ్యా (87, 90 బంతుల్లో) ఎదురుదాడి చేశారు. ఏ మాత్రం భయపడకుండా ఒత్తిడిని జయించి సూపర్ ఇన్నింగ్స్ ఆడారు. దాంతో భారత్ 66/4 నుంచి 266 పరుగులకు చేరుకోగలిగింది. భారత బ్యాటర్లలో ఏ బ్యాటర్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. జడేజా (14, 22 బంతుల్లో), షార్దూల్ (3, 3 బంతుల్లో) కూడా విఫలం అయ్యారు. చివర్లో బుమ్రా (16, 14 బంతుల్లో) పాక్ బౌలర్లకు చెమటలు పట్టించాడు. దీంతో భారత్ 266 పరుగుల మార్క్ కు చేరుకోగలిగింది.
ఒత్తిడిలోకి నెట్టి:
ఎప్పటిలాగే పాక్ బౌలర్లు టీమిండియాపై తమ ఆధిపత్యాన్ని కొనసాగించారు. వరల్డ్ బెస్ట్ బౌలింగ్ అటాక్ అని నిరూపించారు. నిప్పులు చెరిగే బంతులేస్తూ భారత బ్యాటర్లను ఇబ్బంది పెట్టారు. 10 ఓవర్లలోనే టీమిండియా కీలక బ్యాటర్లను పెవిలియన్ చేర్చి జట్టును ఒత్తిడిలోకి నెట్టారు. దీంతో టీమిండియా ఆశించినంత భారీ స్కోర్ చేయలేకపోయింది. పాక్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది 4 వికెట్లు పడగొట్టగా.. నసీమ్ షా, హరీస్ రౌఫ్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు.