Virat kohli Home tour video: కోహ్లీ హోం టూర్.. అది ఇళ్లు కాదు ఇంద్ర భవనమే
X
విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలు ముచ్చటపడి కొత్త ఇళ్లు కట్టించుకున్న సంగతి తెలిసిందే. ముంబైలోకి అలిబాగ్ లో దాదాపు 8 ఎకరాల విస్తీర్ణంలో తమ హాలిడే హోంను నిర్మించుకున్నారు. ఇంటి పని పూర్తైన సందర్భంగా.. తమ ఇంటిని కోహ్లీ హోం టూర్ చేశాడు. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో కోహ్లీ తన లివింగ్ రూం మొదలుకుని అన్ని చోట్ల ప్రతీ అంగుళం వదల కుండా చూపించాడు.
ఆ ఇంటికి ఆవాస్ లివింగ్ హోంగా నామకరణం కూడా చేశారు. కాగా వీడియో చూసినవారంతా.. కోహ్లీ, అనుష్కల ఇళ్లు ఇంద్రభవనంలా ఉందని అంటున్నారు. ఆ ఇంటి స్పెషాలిటీ ఏంటంటే.. దాదాపు 10వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో కాలిఫోర్నియన్ కొంకణ్ స్టైల్లో ఇళ్లు ఉంటుంది. ప్రకృతిలో పరవశించడానికి చుట్టూ పచ్చని చెట్లు, స్విమ్మింగ్ పూల్ స్పెషల్ అట్రాక్షన్. అయితే ఇందులో ఓ ప్రత్యేకత ఉంది. ఈ ఇంట్లో ఎలాంటి టీవీలు, ఎలక్ట్రానిక్ పరికరాలు లేవు. ఈ విషయాన్ని కోహ్లీనే స్వయంగా చెప్పుకొచ్చాడు. తమ ఇంట్లో ఎలాంటి డిస్టబెన్స్ లేకుండా.. ప్రశాంతంగా కూర్చొని ఫ్యామిలీతో గడపేందుకు ఇలా డిజైన్ చేయించుకున్నట్లు చెప్పాడు.