Home > క్రికెట్ > మనోడు చితక్కొట్టేశాడు...500వ మ్యాచ్ లో ఎవరికీ సాధ్యం కాని రికార్డ్

మనోడు చితక్కొట్టేశాడు...500వ మ్యాచ్ లో ఎవరికీ సాధ్యం కాని రికార్డ్

మనోడు చితక్కొట్టేశాడు...500వ మ్యాచ్ లో ఎవరికీ సాధ్యం కాని రికార్డ్
X

ఎక్కడున్నా తన ప్రత్యేకతను నిలుపుకోవడం స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీకి అలవాటు. అలాగే తాను ఆడుతున్న 500వ మ్యాచ్ ను మాత్రం ఎందుకు వదిలిపెట్టేయాలని అనుకున్నాడు. ఎవ్వరూ చెయ్యని విధంగా హాఫ్ సెంచరీ చెయ్యడమే కాదు...87 పరుగులతో ఇంకా క్రీజులో ఉన్నాడు. మరో 13 పరుగులు చేశాడో ఈ బాబు రికార్డ్ ను బద్దలుకొట్టడం ఎవ్వరివల్లా కాదు.

పోర్ట్ ఆఫ్ స్పెయిన్ లో వెస్టిండీస్, ఇండియా తమ రెండవ టెస్ట్ ఆడుతున్నాయి. ఇది భారత ప్లేయర్ విరాట్ కోహ్లీకి 500వ అంతర్జాతీయ మ్యాచ్. ఈ మ్యాచ్ ఆడి విరాట్....దిగ్గజాలు సచిన్, మహేల జయవర్ధనే, సంగక్కర,జయసైర్య, రికీ పాంటింగ్, థోని, రాహుల్ ద్రావిడ్ సరసన చేరాడు. రెండవ టెస్ట్ మ్యాచ్లో కోహ్లీ 161 బంతుల్లో 8ఫోర్లతో 87 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. 500 మ్యాచ్ లు ఆడిన వాళ్ళు ఇతని కన్నా ముందున్నా...ఇలా హాఫ్ సెంచరీ చేసిన మొదటి క్రికెటర్ మాత్రం విరాట్ కోహ్లీనే. దిగ్గజాలకు కూడా సాధ్యం కాని రికార్డ్ ను సాధించి చరిత్రలో నిలిచిపోయాడీ ఈ స్టార్ బ్యాట్స్ మెన్.





ఇక టెస్ట్ క్రికెట్లో నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చి అత్యధిక పరుగులు చేసిన జాబిలాలో కోహ్లీ 5వ స్థానానికి చేరుకున్నాడు. 7,097 పరుగులతో ఈ స్థానంలో ఉన్నాడు. ఇందులో కూడా మన సచినే 13492 పరుగులతో మొదటి స్థానంలో ఉన్నాడు. తరువాతి స్థానాల్లో మహేల జయవర్ధనే, జాక్ కలిస్, బ్రియాన్ లారాలు ఉన్నారు.

అలాగే అంతర్జాతీయ క్రికెట్ లో అన్ని ఫార్మాట్లు కలిపి అత్యధిక పరుగులు చేసిన లిస్ట్ లో కూడా విరాట్ కోహ్లీ 5వ స్థానంలో నిలిచాడు. ఇప్పటివరకు 25548 పరుగులు చేశాడు. మొదటి స్థానంలో సచిన్ 34357, కుమార సంగక్కర 28016, రికీ పాంటింగ్ 27483, మహేలా జయవర్ధనే 25957 పరుగులతో తరువాతి స్థానాల్లో ఉన్నారు.



Updated : 21 July 2023 10:13 AM IST
Tags:    
Next Story
Share it
Top