Home > క్రికెట్ > రెండు సార్లు ప్రపంచ ఛాంపియన్.. ఈ సారి ఎంట్రీ కూడా కష్టమే..

రెండు సార్లు ప్రపంచ ఛాంపియన్.. ఈ సారి ఎంట్రీ కూడా కష్టమే..

రెండు సార్లు ప్రపంచ ఛాంపియన్.. ఈ సారి ఎంట్రీ కూడా కష్టమే..
X

వెస్టిండీస్.. విధ్వంసక బాటర్లకు పుట్టినిల్లు.. రెండు సార్లు వరల్డ్ ఛాంపియన్.. కానీ ఇప్పుడు దయనీయ స్థితిలో ఉంది. కనీసం వరల్డ్కప్కు క్వాలిఫై అవ్వడం కష్టమే అనే స్థితికి చేరుకుంది. నిన్నటి వరకు క్వాలిఫై ఆశలు సజీవంగానే ఉన్న నిన్న నెదర్లాండ్స్ చేతిలో ఓటమితో ఆ ఆశలు ఆవిరయ్యాయి. ఈ ఓటమితో విండీస్‌ ఖాళీ ఖాతాతో సూపర్‌ సిక్స్‌కు అడుగుపెట్టనుంది. దీంతో వరల్డ్‌కప్‌ అవకాశాలను ఆవిరి చేసుకుంది.

గ్రూప్‌-ఏ నుంచి సూపర్‌ సిక్స్‌కు చేరుకున్న మూడు జట్లలో ప్రస్తుతం జింబాబ్వే ఖాతాలో 4 పాయింట్లు, నెదర్లాండ్స్‌ ఖాతాలో 2 పాయింట్లు, వెస్టిండీస్‌ ఖాతాలో 0 పాయింట్లు ఉన్నాయి. గ్రూప్‌-బి నుంచి శ్రీలంక, స్కాట్లాండ్‌, ఒమన్‌ జట్లు సూపర్‌ సిక్స్‌కు చేరుకున్నాయి. అయితే శ్రీలంక-స్కాట్లాండ్‌ మధ్య ఇవాళ జరుగబోయే మ్యాచ్‌తో ఏ జట్టు ఎన్ని పాయింట్లతో సూపర్‌ సిక్స్‌కు చేరుకుంటుందో తేలిపోతుంది.





గ్రూప్‌ దశలో సాధించిన అదనపు పాయింట్లతో ప్రతి జట్టు సూపర్‌ సిక్స్‌ దశకు చేరుకుంటుంది. ఈ దశలో ఓ గ్రూప్‌లోని ఓ జట్టు మరో గ్రూప్‌లోని 3 జట్లతో ఒక్కో మ్యాచ్‌ అడుతుంది. అన్ని జట్లు తలో 3 మ్యాచ్‌లు ఆడిన తర్వాత టాప్‌-2లో నిలిచిన జట్లు ఫైనల్‌కు చేరుతాయి. ఈ రెండు జట్లు ఈ ఏడాది చివర్లో భారత్‌లో జరిగే వన్డే వరల్డ్‌కప్‌కు అర్హత సాధిస్తాయి. నిన్న నెదర్లాండ్స్ పై ఓటమితో విండీస్ వరల్డ్ కప్ చేరుకోవడం అసాధ్యమే.

సూపర్ సిక్స్‌ దశకు చేరిన విండీస్.. ఈ దశలో ఆడాల్సిన 3 మ్యాచ్‌ల్లో గెలిచినా 6 పాయింట్లు మాత్రమే సాధిస్తుంది. మరోవైపు జింబాబ్వే ఇప్పటికే 4 పాయింట్లు సాధించగా.. శ్రీలంక, స్కాట్లాండ్‌లతో ఏదో ఒక జట్లు 4 పాయింట్లతో సూపర్‌ సిక్స్‌కు చేరుతుంది. 4 పాయింట్లతో సూపర్‌ సిక్స్‌కు చేరిన జట్లు రెండు మ్యాచ్‌లు గెలిచినా 8 పాయింట్లతో ఫైనల్‌కు చేరుకుంటాయి. అందుకే ఏదైనా సంచలనం నమోదైతే తప్ప విండీస్‌ వరల్డ్‌కప్‌కు అర్హత సాధించలేదు.


Updated : 27 Jun 2023 11:28 AM IST
Tags:    
Next Story
Share it
Top