పుజారాను పక్కనబెట్టిన సెలెక్టర్లు.. గవాస్కర్ రియాక్షన్ ఇదే..
X
వెస్టిండీస్ పర్యటనకు వెళ్లే భారత్ టెస్ట్, వన్డే జట్టులను శుక్రవారం బీసీసీఐ ప్రకటిచింది. ఇక టెస్ట్ జట్టులో పుజారాకు చోటు లభించకపోవడం చర్చనీయాంశమైంది. డబ్ల్యూటీసీ ఫైనల్లో ఘోరంగా విఫలమవడమే పుజారాపై వేటుకు కారణమనే టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలో పుజారాను సెలక్ట్ చేయకపోవడంపై మాజీ క్రికెటర్ సనీల్ గవాస్కర్ స్పందించారు.
డబ్ల్యూటీసీ ఫైనల్‌లో టీమిండియా బ్యాటింగ్ యూనిట్ మూకుమ్మడిగా ఫెయిల్ అయినా పూజారాని మాత్రం ఎందుకు బలిపశువు చేశారంటూ గవాస్కర్ ఫైర్ అయ్యారు.
‘‘ఛతేశ్వర్ పూజారాని ఎందుకు తప్పించారు. భారత బ్యాటింగ్ యూనిట్ మొత్తం ఫెయిల్ అయినప్పుడు అతన్ని మాత్రం ఎందుకు బలిపశువుని చేశారు. విరాట్ కోహ్లీ బాగా ఆడాడా.. రోహిత్ శర్మ బాగా ఆడాడా. శుబ్‌మన్ గిల్ కూడా ఒరగబెట్టిందేమీ లేదు’’ అని మండిపడ్డారు.
టీమ్‌ని ప్రకటించేటప్పుడు సెలక్షన్ కమిటీ, మీడియా సమావేశం ఎందుకు పెట్టడం లేదని గవాస్కర్ ప్రశ్నించారు. వాళ్లు వేసే ప్రశ్నలకు సెలక్షన్ కమిటీ దగ్గర జవాబులు లేకపోవడంతోనే ప్రెస్ మీట్ పెట్టడం లేదని విమర్శించారు. పుజారాను ఎందుకు ఎంపిక చేయలేదో సెలెక్టర్లు చెప్పాలని గవాస్కర్ డిమాండ్ చేశారు.