భారత్‌కు షాక్..కోహ్లీ, జడేజా ఔట్..!
X
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్‌లో విజయమే లక్ష్యంగా చివరి రోజు ఆటను ప్రారంభించిన భారత్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న విరాట్ కోహ్లీ 49 పరుగులు వద్ద ఔటయ్యాడు. తర్వాత రెండు బంతులకే రవీంద్ర జడేజా పెవిలియన్ కు చేరాడు. దీంతో భారత్ 179 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఇంకా విజయం 260 పరుగులు చేయాల్సి ఉండగా చేతిలో ఐదు వికెట్లు ఉన్నాయి.
ఆసీస్ నిర్దేశించిన 444 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించే క్రమంలో 99 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ క్రమంలో విరాట్, రహానె జోడి నిలబడి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు. నాలుగో రోజు మరో వికెట్ పడకుండా అడ్డుకోవడంతో మ్యాచ్‌పై ఆశలు చిగురించాయి. ఐదు రోజు అదే ఫామ్ తో రాణించి రికార్డు విజయం సాధిస్తారని అంతా భావించారు. కానీ భారత్ ఆటను ప్రారంభించిన కాసేపటికే కోహ్లీ, జడేజా రూపంలో రెండు కీలక వికెట్లు కోల్పోవడం విజయంపై ఆశలు సన్నగిల్లాయి.ప్రస్తుతం క్రీజ్‌లో రహానె(30), శ్రీకర్ భరత్ (4) ఉన్నారు.