WTC ఫైనల్ : కష్టాల్లో భారత్.. 3 వికెట్లు డౌన్...
X
డబ్ల్యూటీసీ ఫైనల్లో మ్యాచ్‌లో భారత్ కష్టాల్లో పడింది. 444 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించే క్రమంలో 99 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. విజయమే లక్ష్యంగా రెండో ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించిన భారత్‌కు శుభారంభం దక్కింది. మొదటి వికెట్‌కు రోహిత్, గిల్ 41 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. 5 కి పైగా రన్ రేట్‌తో పరుగులు చేస్తూ మ్యాచ్ ఫలితంపై ఆసక్తిని పెంచారు. అయితే ఇద్దరు మంచి టచ్ లో ఉన్న సమయంలో గిల్ ఔటయ్యాడు.
తర్వాత పుజారాతో కలిసి రోహిత్ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. ఇద్దరు వీలు దొరికినప్పుడల్లా బౌండరీలు బాది స్కోరు బోర్డులో వేగం పెంచారు. ఈ సమయంలో ఒక్కసారిగా భారత్‌కు షాక్ తగిలింది. అర్థ శతకం దిశగా దూసుకుపోతున్న రోహిత్ శర్మను స్పిన్నర్ లియాన్ ఔట్ చేశాడు. దీంతో 92 పరుగుల వద్ద భారత్ రెండో వికెట్ కోల్పోయింది. ఆ తరువాతి ఓవర్లోనే పుజారా కూడా పెవిలియన్‌కు చేరడంతో భారత్ పీకల్లోతూ కష్టాల్లో కూరుకుపోయింది. ప్రస్తుతం క్రీజ్‌లో ఉన్న విరాట్ కోహ్లీ, రహానెపైనే ఆశలు ఉన్నాయి. భారత్ బ్యాటింగ్‌లో రోహిత్ 43, గిల్ 18, పుజారా 27 పరుగులు చేశారు. ఆస్ట్రేలియా బౌలర్లలో లియాన్, బోలాండ్, కమ్మిన్స్‌లకు ఒక్కో వికెట్ లభించింది.