Home > క్రికెట్ > కప్పు చేయి జారినట్టే.. ఆడుతుంది ఫైనల్ మ్యాచ్ అని మర్చిపోయారు

కప్పు చేయి జారినట్టే.. ఆడుతుంది ఫైనల్ మ్యాచ్ అని మర్చిపోయారు

కప్పు చేయి జారినట్టే.. ఆడుతుంది ఫైనల్ మ్యాచ్ అని మర్చిపోయారు
X

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ కు.. ఫేవరెట్ జట్టుగా బరిలోకి దిగింది ఆసీస్. అయితే, టీమిండియాను ఎవరూ తక్కువ అంచనా వేయలేదు. పటిష్టమైన బ్యాటింగ్ లైనప్.. ఐపీఎల్ లో సత్తా చాటిన బౌలింగ్ యూనిట్.. ఆస్ట్రేలియాకు గట్టిపోటీ తప్పదని అనుకున్నారు. ఈ ఊహలన్నీ తప్పని నిరూపించడానికి టీమిండియాకు ఒక్క రోజు కూడా పట్టలేదు. అయితే, మ్యాచ్ మొదలైన కొన్ని గంటల వరకు జోష్ గానే కనిపించారు. వెంట వెంటనే మూడు వికెట్లు పడగొట్టారు. అంతే, మిగతా రోజంగా ఆసీస్ బ్యాట్స్ మెన్.. భారత బౌలర్లపై ఆధిపత్యాన్ని ప్రదర్శించారు.

ట్రావిస్ హెడ్ (163, 174 బంతుల్లో), స్టీవ్ స్మిత్ (121, 268 బంతుల్లో) కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పి.. భారత్ ను దెబ్బకొట్టారు. వీరి పోరాట పటిమతో మరో వికెట్ నష్టపోకుండా క్రీజులో నిలిచారు. ట్రావిస్ హెడ్ అయితే.. ఏకంగా వన్డే ఇన్నింగ్స్ ఆడినట్లు బ్యాటింగ్ చేశాడు. 93.68 స్ట్రైక్ రేట్ తో 25 ఫోర్లు, 1 సిక్సర్ బాదాడు. దీంతో మొదటి రోజు ఆట భారత్ చేయి జారిపోయింది.

ఫీల్డింగ్ సెటప్లో లోపం:

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్.. ఫీల్డింగ్ లో లోపం కనిపించింది. దీనికి కారణం కెప్టెన్ రోహిత్ శర్మ. బ్యాట్స్ మెన్ లైన్ ను తగ్గ ఫీల్డింగ్ సెట్ చేయలేకపోయాడు. ముఖ్యంగా ఉమేష్ యాదవ్ బౌలింగ్ లో ఆసీస్ బ్యాట్స్ మెన్ ఈజీగా పరుగులు రాబట్టారు. ఉమేష్ లైన్ అండ్ లెంగ్త్ కరెక్ట్ గా ఉన్నా.. ఫీల్డింగ్ సెటప్ లో లోపం వల్ల ఈజీగా పరుగులు వచ్చాయి. దీంతో కెప్టెన్ రోహిత్ పై పలువురు మాజీ ఆటగాళ్లు ఫైర్ అయ్యారు.

అలసిపోయిన ఆటతీరు:

మొదటి రోజు చివరి ఇన్నింగ్స్ లో భారత్ ఆటగాళ్లు అలసిపోయినట్లు కనిపించారు. ఫాస్ట్ బౌలర్ల రిథమ్ దెబ్బతింది. బౌలింగ్ లైన్ కోల్పోయి ఇబ్బంది పడ్డారు. ఆటగాళ్లను చూస్తుంటే ఆడుతుంది అసలు ఫైనల్ మ్యాచేనా అన్నట్లు అనిపించింది. దీనికి కారణం.. బౌలింగ్ యూనిట్ లో అశ్విన్ లేకపోవడం అనికూడా చెప్పొచ్చు. పిచ్ ఫాస్ట్ బౌలర్లకు సహకరిస్తుంది. అయినా, టీంలో ఒక స్పిన్నర్ ను పెట్టుకుని ఆటలోకి దిగారు. అయితే, నంబర్ వన్ పొజిషన్ లో ఉన్న అశ్విన్ ను కాదని.. కేవలం బ్యాటింగ్ లో హెల్ప్ అవుతాడన్న కారణంతో జడేజాను ప్లేయింగ్ లెవన్ లోకి తీసుకున్నారు. అశ్విన్ ఉంటే ఆసీస్ బ్యాటింగ్ పై ప్రభావం చూపేవాడు. ఒక్క వికెట్ అయినా పడగొట్టే వాడు. బౌలింగ్ బాధ్యతను మోసేవాడు.

పది శాతం కూడా లేని గెలుపు అవకాశాలు:

మొదటిరోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా గెలుపు అవకాశాలు పది శాతం (8 శాతం) కన్నా తక్కువగా ఉన్నాయి. డ్రా అవడానికి 37 శాతం అవకాశం ఉంది. సీనియర్ ఆటగాళ్లు కూడా.. ఆసీస్ గెలుస్తుందనే చెప్తున్నారు. వీటన్నింటినీ దాటి టీమిండియా గెలుస్తుందా.. కప్పు కొట్టాలన్న 9 ఏళ్ల నిరీక్షణకు తెర దించుతుందా చూడాలి.


Updated : 8 Jun 2023 6:28 PM IST
Tags:    
Next Story
Share it
Top