Home > క్రీడలు > కోహ్లీ సూచనలతోనే ఆడాను.. విండీస్ మ్యాచ్పై పాండ్యా

కోహ్లీ సూచనలతోనే ఆడాను.. విండీస్ మ్యాచ్పై పాండ్యా

కోహ్లీ సూచనలతోనే ఆడాను.. విండీస్ మ్యాచ్పై పాండ్యా
X

వెస్టిండీస్తో జరిగిన మూడో వన్డేలో భారత్ చెలరేగింది. విండీస్ జట్టును 200 రన్స్ తేడాతో చిత్తుగా ఓడించి.. 2-1తో సిరీస్ కైవసం చేసుకుంది. రెండో వన్డేలో ఓడినా మూడో వన్డేలో విండీస్కు భారీ టార్గెట్ ను ఇచ్చింది. ఆ తర్వాత బ్యాటింగ్ బరిలోకి దిగిన విండీస్ భారత బౌలర్ల దెబ్బకు 151 పరుగులకే ఆలౌట్ అయ్యింది. స్టార్ ప్లేయర్లు రోహిత్, కోహ్లీ ఆడకున్నా.. యువ ఆటగాళ్లు అదరగొట్టారు. రెండో వన్డేలా కాకుండా సమిష్టిగా రాణించి ఇండియాకు సిరీస్ను అందించారు.

ఈ మ్యాచ్ తర్వాత హార్దిక్ పాండ్యా కీలక వ్యాఖ్యలు చేశారు. రెండో వన్డేలో ఓడిపోయిన తర్వాత తమపై ఎన్నో విమర్శలు వచ్చాయన్నారు. ఇలాంటి సమయంలో ఒత్తిడిని తట్టుకుని మరీ తమ ప్లేయర్స్ అదరగొట్టారని చెప్పారు. సీనియర్లు విరాట్, రోహిత్ లేకున్నా.. చాలా బాగా రాణించడంతో సిరీస్ కైవసం చేసుకున్నట్లు తెలిపారు. ఒకవేళ ఈ మ్యాచ్లో ఓడిపోతే ఎంతో నిరాశకు గురయ్యేవాళ్లామని అన్నారు. విరాట్, రోహిత్ మా జట్టులో ఎప్పుడూ భాగమేనని చెప్పుకొచ్చాడు.

మ్యాచ్కు ముందు విరాట్ కోహ్లీతో మాట్లాడడం ఎంతో ఉపయోగపడిందని పాండ్యా చెప్పారు. ‘‘క్రీజ్‌లో ఎక్కువ సమయం గడిపేందుకు ప్రయత్నించమని నాకు విరాట్ సూచించాడు. 50 ఓవర్ల ఫార్మాట్‌లో ఎక్కువ రన్స్ చేయాలంటే ఇదే మంచి మార్గం. ఈ మ్యాచ్‌లో విరాట్ చెప్పినట్లే ఆడేందుకు ప్రయత్నించి.. సక్సెస్ అయ్యా. దానికి కోహ్లీకి థ్యాంక్స్ చెప్పకుండా ఉండలేను’’ అని వివరించాడు.

Updated : 2 Aug 2023 1:11 PM IST
Tags:    
Next Story
Share it
Top