Home > క్రీడలు > Sanju Samson: జట్టులో నో ప్లేస్.. సంజూ కెరీర్కు ఎండ్ కార్డ్

Sanju Samson: జట్టులో నో ప్లేస్.. సంజూ కెరీర్కు ఎండ్ కార్డ్

Sanju Samson: జట్టులో నో ప్లేస్.. సంజూ కెరీర్కు ఎండ్ కార్డ్
X

సంజు శాంసన్.. భారత క్రికెట్ లో మోస్ట్ అండర్ రేటెడ్ ప్లేయర్స్ లో ఒకడు. 2015లో భారత్ తరుపున టీ20ల్లో అరంగేట్రం చేశాడు. 2021లో వన్డే క్రికెట్లో, 2023లో టెస్ట్ క్రికెట్ క్యాప్ అందుకున్నాడు. ఈ తొమ్మిదేళ్లలో కెరీర్ గ్రాఫ్ ఎక్కడికో వెళ్లాల్సింది. కానీ.. రియాలిటీ చూసుకుంటే.. వన్డేల్లో 13 మ్యాచులు, టీ20ల్లో 24 మ్యాచులు మాత్రమే ఆడాడు. కెరీర్ మొదట్లో ఫ్యూచర్ స్టార్ అవుతాడని అంతా అనుకున్నారు. తీరా చూస్తే జట్టులో లేకుండా పోయాడు. మరీ అవకాశం పడితే తప్ప సంజూను జట్టులోకి ఎంపిక చేయట్లేదు బీసీసీఐ. దురదృష్టం వెంటాడటంతో చాన్స్ లు వచ్చినట్లే వచ్చి చేజాయిపోతున్నాయి. ఈ క్రమంలో రిషబ్ పంత్, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్ రూపంలో కీపర్ స్థానంలో పోటీ ఎదురైంది. పూర్తి అవకాశాలు ఇవ్వకపోగా.. అవకాశం వచ్చినప్పుడు సంజూ ఫెయిల్ అవ్వడం కెరీర్ కు కలిసిరాలేదు.

ప్రస్తుతం సంజూ.. వన్డేల్లో 56 సగటు, 103 స్ట్రైక్ రేట్ తో ఫామ్ లోనే ఉన్నాడు. దీంతో ఆసియా కప్, ఆస్ట్రేలియా సిరీస్, వన్డే వరల్డ్ కప్ లో చోటు దక్కుతుందని భావించారు. మిడిల్ ఆర్డర్ సమస్య తీరిపోయిందని అనుకున్నారు. తీరా చూస్తే.. ఏడాదిగా జట్టులో లేని ఆటగాళ్లకు చాన్స్ ఇచ్చి సంజూను పక్కనబెట్టారు. అయితే చైనాలో జరిగే ఏషియన్ గేమ్స్ కు అయినా ఎంపిక చేస్తారనుకుంటే అక్కడా మొండిచేయే ఎదురైంది. అసలు బీసీసీఐ నోట సంజూ శాంసన్ ఊసే కనిపించలేదు. దీంతో తీవ్ర నిరాశలో ఉన్న సంజూ.. తన అసంతృప్తిని ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. ‘అయిందేదో అయింది. ఇకపై నా ఆటను కొనసాగించడమే నా పని’ అని పోస్ట్ పెట్టాడు. శ్రేయస్ అయ్యర్ గాయంతో బాధ పడుతున్నా.. టీంలో కొనసాగిస్తున్నారు. ఏషియన్ గేమ్స్ కు కెప్టెన్ గా నియమించిన రుతురాజ్ గైక్వాడ్ ను కూడా ఆస్ట్రేలియా సిరీస్ కు ఎంపిక చేశారు. ఈ క్రమంలో బీసీసీఐ సంజు శాంసన్ ను ఎంపిక చేయకపోండం.. అతని కెరీర్ కు ఎండ్ కార్డ్ పడినట్లే అని ఎక్స్ పర్ట్స్ అంటున్నారు.

Updated : 19 Sept 2023 6:59 PM IST
Tags:    
Next Story
Share it
Top