Home > క్రీడలు > డబ్బులొస్తే చాలా...క్రికెట్ ఆడక్కరల్లేదా? యంగ్ క్రికెటర్ల మీద విరుచుకుపడ్డ కపిల్ దేవ్

డబ్బులొస్తే చాలా...క్రికెట్ ఆడక్కరల్లేదా? యంగ్ క్రికెటర్ల మీద విరుచుకుపడ్డ కపిల్ దేవ్

డబ్బులొస్తే చాలా...క్రికెట్ ఆడక్కరల్లేదా? యంగ్ క్రికెటర్ల మీద విరుచుకుపడ్డ కపిల్ దేవ్
X

యువ క్రికెటర్ల మీద మాజీ టీమ్ ఇండియా ప్లేయర్ కపిల్ దేవ్ విరుచుకుపడ్డారు. గాయాలపాలవుతున్న ఆటగాళ్ళ గురించి వ్యాఖ్యలు చేశారు. టీమ్ లో కీలకమైన ప్లేయర్లలో దేశం కోసం ఆడాలన్న తపన కన్నా డబ్బులు సంపాదించడమే ముఖ్యమనుకుంటున్నారని విమర్శించారు.

భారత్ కు ఆడుతున్న ప్రస్తుత క్రికెటర్లు తమకే అన్నీ తెలుసన్న భ్రమలో ఉంటున్నారని...ఎవ్వరినీ సలహాలు కూడా అడగరనీ కోపడ్డారు కపిల్ దేవ్. ఐపీఎఅల్ కి అయితే గాయాల సాకు చెప్పడం లేదు కానీ జాతీయ జట్టులోకి వచ్చేసరికి చిన్న సాకులతో విశ్రాంతి తీసుకుంటున్నారని కపిల్ అభిప్రాయం వ్యక్తం చేశారు. తాజాగా ఓ మ్యాగజైన్ కు ఇచ్చిన కపిల్ దేవ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇండియా స్టార్ పేసర్ బుమ్రా ఏడాదిపాటు టీమ్ కు దూరమవ్వడం మీద కపిల్ దేవ్ మండిపడ్డారు. వరల్డ్ కప్ కు నాటికి సిద్ధం కాకపోతే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. అలాగే రిషబ్ పంత్ కూడా జట్టుకు దూరం అవ్వడం మీద కపిల్ విచారం వ్యక్తం చేశాడు. అతను గొప్ప క్రికెటర్...టెస్ట్ క్రికెట్ లో అతను ఉంటే ఎంతో బాగుండేది అని చెప్పుకొచ్చారు.

అలాగే ఐపీఎల్ గురించి మాట్లాడుతూ....ఆ టోర్నీ చాలా గొప్పదే కానీ...అది యువ క్రికెటర్లను దెబ్బ తీస్తోందని కపిల్ అభిప్రాయం వ్యక్తం చేశారు. చిన్నపాటి గాయాలతో ఐపీెల్ లో అడుతుతన్నారు కానీ అదే టీమ్ ఇండియాకు ఆడమంటే ఆడటం లేదు, విశ్రాంతి తీసుకుంటున్నారు...ఇది నేను చాలా ఓపెన్ గా చెబుతున్నా అంటూ ఆటగాళ్ళ మీద అసంతృప్తి వ్యక్తం చేశారు.

Updated : 31 July 2023 1:08 PM IST
Tags:    
Next Story
Share it
Top