దంచికొట్టిన ఓపెనర్లు.. భారీ స్కోర్ చేసిన ఆస్ట్రేలియా
X
వరల్డ్ కప్లో భాగంగా న్యూజిలాండ్తో జరుగుతున్న మ్యాచులో ఆస్ట్రేలియా దంచికొట్టింది. ధర్మశాల స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో నిర్ణీత 50 ఓవర్లలో 388 రన్స్ చేసింది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్ కివీస్ బౌలర్లను ఓ ఆటాడుకున్నారు. వీరద్దరూ ఫస్ట్ వికెట్కు 175 రన్స్ చేసి జట్టుకు మంచి స్కోర్ అందించారు. హెడ్ 67 బంతుల్లోనే 109 రన్స్తో అదరగొట్టగా.. వార్నర్ 65 బాల్స్లో 81 రన్స్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్స్లలో మ్యాక్స్ వెల్ 41, ఇంగ్లిస్ 38 రన్స్తో రాణించారు.
న్యూజిలాండ్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ 3, ఫిలిప్స్ 3, సాంట్నర్ 2 వికెట్లు తీశారు. అంతకుముందు టాస్ గెలిచిన కివీస్ బౌలింగ్ ఎంచుకుంది. పాయింట్ల పట్టికలో న్యూజిలాండ్ 3వ స్థానంలో ఉండగా.. ఆసీస్ 4వ స్థానంలో ఉంది. ఫస్ట్ రెండు మ్యాచుల్లో ఓడిన ఆస్ట్రేలియా.. ఆ తర్వాత హ్యాట్రిక్ విజయాల్ని నమోదు చేసింది. ఈ మ్యాచులోనూ గెలిచి తమ సత్తా చాటాలని భావిస్తోంది. అటు న్యూజిలాండ్ సైతం నాలుగు మ్యాచుల్లో గెలిచి మంచి ఊపు మీదుంది. ఇదే ఊపులో ఆసీస్ ను చిత్తు చేయాలనే పట్టుదలతో ఉంది.