Home > క్రీడలు > David Warner : అది నాకెంతో సెంటిమెంట్.. ప్లీజ్ తిరిగిచ్చేయండి

David Warner : అది నాకెంతో సెంటిమెంట్.. ప్లీజ్ తిరిగిచ్చేయండి

David Warner : అది నాకెంతో సెంటిమెంట్.. ప్లీజ్ తిరిగిచ్చేయండి
X

విధ్వంసకర బ్యాటర్ డేవిడ్ వార్నర్ తన టెస్ట్ కెరీర్ కు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. రేపు (జనవరి 3) సిడ్నీ వేదికగా పాకిస్తాన్ తో జరగబోయే టెస్ట్ మ్యాచే తన కెరీర్ లో చివరిది. ఈ క్రమంలో డేవిడ్ వార్నర్ కు ఓ చేదు అనుభవం ఎదురైంది. అతని బ్యాగీ గ్రీన్ క్యాప్ (ఆసీస్ టెస్టుల్లో ధరించే క్యాప్) ను పోగొట్టుకున్నాడు. ఈ విషయాన్ని వార్నరే స్వయంగా చెప్పుకొచ్చాడు. మెల్ బోర్న్ నుంచి సిడ్నీకి వచ్చే క్రమంలో తన లగేజ్ నుంచి బ్యాక్ ప్యాక్ ను ఎవరో తీసుకున్నారు. అందులో తన క్యాప్ ఉందని, అది తనకెంతో సెంటిమెంట్ అని చెప్పుకొచ్చాడు. దీనిపై ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఓ వీడియో విడుదల చేసిన వార్నర్.. తన క్యాప్ తిరిగి ఇచ్చేయాలని వేడుకున్నాడు.

‘నా బ్యాక్ ప్యాక్ ను ఎవరో తీసుకున్నారు. అందులో నా పిల్లల వస్తువులతో పాటు బ్యాగీ గ్రీన్ క్యాప్ కూడా ఉంది. అది నాకెంతో సెంటిమెంట్. అది పెట్టుకుని రేపటి నా చివరి టెస్ట్ మ్యాచ్ ఆడాలనుకున్నా. కావాలని ఎవరైనా తీసి ఉంటే ప్లీజ్ తిరిగి ఇచ్చేయండి. వారికి మరో బ్యాక్ ప్యాక్ ఇస్తాను. మిమ్మల్ని అసలు ఇబ్బంది పెట్టను. ఎయిర్ పోర్ట్, హోటల్ లో వెతికాం. సిబ్బందిని కూడా విచారించాం. సీసీటీవీలో వెతికాం. కానీ ఎక్కడా దాని జాడ కనిపించలేదు. దయచేసి నా బ్యాగీ గ్రీన్ క్యాప్ ను తిరిగిచ్చేస్తే సంతోషిస్తా’ అని వార్నర్ విజ్ఞప్తి చేశాడు.

Updated : 2 Jan 2024 1:54 PM GMT
Tags:    
Next Story
Share it
Top