Home > క్రీడలు > Rishabh Pant : ఐపీఎల్‌కు రిషబ్ పంత్ సిద్ధం.. వీడియో వైరల్

Rishabh Pant : ఐపీఎల్‌కు రిషబ్ పంత్ సిద్ధం.. వీడియో వైరల్

Rishabh Pant : ఐపీఎల్‌కు రిషబ్ పంత్ సిద్ధం.. వీడియో వైరల్
X

టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఈసారి జరగబోయే ఐపీఎల్‌-2024లో రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమవుతున్నాడు. 2022 డిసెంబర్‌లో పంత్ కారు ప్రమాదానికి గురై గాయపడిన సంగతి తెలిసిందే. ఆ ప్రమాదంలో పంత్ నుదుటిపై, వీపుపై తీవ్రంగా గాయాలు అయ్యాయి. కుడి మోకాలుకు కూడా ఆపరేషన్ చేశారు. ఇక అప్పటి నుంచి పంత్ ఇంటికే పరిమితం అయ్యారు. క్రమంగా కోలుకుంటూ వస్తున్నారు. తాజాగా పంత్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు వివరాలు తెలిపారు. పంత్ ఆరోగ్యం గతం కంటే మెరుగ్గా ఉందని తెలిపారు.

తాజాగా రిషబ్ పంత్ వికెట్ కీపింగ్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించారు. కారు ప్రమాదం తర్వాత దాదాపు 15 నెలలుగా పంత్ క్రికెట్‌కు దూరంగా ఉంటూ వస్తున్నారు. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో పంత్ ప్రాక్టీస్ ప్రారంభించారు. వికెట్ కీపింగ్ చేస్తున్న వీడియోలు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పంత్ పోస్ట్ చేయగా అది కాస్తా వైరల్ అవుతోంది. వీడియోను చూసి పంత్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తూ కామెంట్స్ పెడుతున్నారు.

రాబోయే ఐపీఎల్ 2024 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ప్రతి మ్యాచ్ లో ఆడేందుకు పంత్ రెడీ అవుతున్నాడు. అయితే పంత్ గతంలో వికెట్ కీపర్ మాదిరిగా కాకుండా బ్యాటర్‌గా మాత్రమే బరిలోకి దిగే అవకాశం ఉందని క్రికెట్ నిపుణులు చెబుతున్నారు. మార్చి 22వ తేది నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుంది. ఈ టోర్నీకి రిషత్ పంత్ సిద్ధం అవుతుండటంతో ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Updated : 21 Feb 2024 8:58 AM IST
Tags:    
Next Story
Share it
Top