Home > క్రీడలు > కుటుంబంలోని విషాదాలతో మూడేళ్లు ఆటకు దూరం. కట్ చేస్తే.. జాతీయ జట్టులో ఎంట్రీ.. ఎవరీ ఆకాశ్ దీప్

కుటుంబంలోని విషాదాలతో మూడేళ్లు ఆటకు దూరం. కట్ చేస్తే.. జాతీయ జట్టులో ఎంట్రీ.. ఎవరీ ఆకాశ్ దీప్

కుటుంబంలోని విషాదాలతో మూడేళ్లు ఆటకు దూరం. కట్ చేస్తే.. జాతీయ జట్టులో ఎంట్రీ.. ఎవరీ ఆకాశ్ దీప్
X

రంజీల్లో పేరు మోసిన వ్యక్తి కాదు. ఐపీఎల్ లో రాణించిన మ్యాచ్లు లేవు. పెద్ద బ్యాక్ గ్రౌండూ కాదు. ఉందల్లా ట్యాలెంట్ మాత్రమే. దేశానికి ఆడాలి అన్న దృడ సంకల్పం ఒక్కటే అతన్ని ఇక్కడి వరకు తీసుకొచ్చాయి. అప్పుల వల్ల క్రికెట్ ఆడటం మానేసి.. కుటుంబ బాధ్యతలను భూజానేసుకున్నాడు. కొన్నాళ్లకు తిరిగి క్రికెట్ లోకి అడుగుపెట్టి అద్భుత ప్రదర్శన చేశాడు. కట్ చేస్తే.. ఇంగ్లాండ్ తో జరుగుతున్న నాలుగో టెస్టుకు ఆడే అవకాశం దక్కింది. అరంగేట్ర మ్యాచ్ లోనే బుల్లెట్ బంతులతో టాప్ ఆర్డర్ ను కుప్పకూల్చాడు. కీలక 3 వికెట్లు పడగొట్టాడు. మ్యాచ్ లో భారత్ ఆధిపత్యం ప్రదర్శించేలా చేశాడు. అతనే బెంగాల్ స్పీడ్ స్టర్ ఆకాశ్ దీప్. తొలి రెండు టెస్టుల తర్వాత జట్టును మార్చిన బీసీసీఐ.. అవేశ్ ఖాన్ ను తప్పించి ఆకాశ్ దీప్ కు చోటు కల్పించింది. మూడో మ్యాచులో బెంచ్ కే పరిమితం అయిన ఆకాశ్.. బుమ్రాకు రెస్ట్ ఇవ్వడంతో నాలుగో మ్యాచ్ కు ఆడే అవకాశం దక్కింది. ఆడుతుంది తొలి టెస్టే.. ప్రత్యర్థి ఇంగ్లాండ్ అయినా ఏ మాత్ర బెరుకు లేకుండా పులిలా విరుచుకుపడ్డాడు. ముఖ్యంగా జాక్ క్రాలేను ఔట్ చేసిన తీరు అద్భుతం. ఇక అప్పటి నుంచి సోషల్ మీడియాలో ఆకాశ్ ఎవరనే చర్చ జరుగుతుంది. నెట్ లో అతని గురించి తెగ వెతికేస్తున్నారు.

ఎవరీ ఆకాశ్ దీప్?

27ఏళ్ల ఆకాశ్ దీప్ బిహార్ లోని ససారం అనే గ్రామంలో ఓ మధ్య తరగతి కుటుంబంలో జన్మించాడు. చిన్నప్పటి నుంచే క్రికెట్ అంటే పిచ్చి. ఆ వైపు అడుగులు పేస్తున్న టైంలో.. జీవితంలో ఊహించని విషాదం చోటు చేసుకుంది. అనుకోకుండా తండ్రి ఆ కొద్ది రోజులకే సోదరుడు మరణించారు. కుటుంబ భారం తనపై పడింది. దాంతో 17 ఏళ్ల వయసులో క్రికెట్ వదిలేసి పనిచేసుకోవడం మొదలుపెట్టాడు. కొన్నిరోజులకు మళ్లీ తన కెరీర్ వైపు అడుగులు వేశాడు. తన సొంత రాష్ట్రం బిహార్ నుంచి అవకాశాలు తక్కువ అని తెలిసి వెస్ట్ బెంగాల్ కు మకాం మార్చాడు. బెంగాల్ లోని అసన్సోల్ లో ఓ క్రికెట్ అకాడమీలో చేరాడు. అక్కడ జరిగిన టెన్నిస్ బాల్ టోర్నీలో అద్భుత ప్రదర్శన చేయడంతో దుబాయ్ వెళ్లే అవకాశం దక్కింది. ఆకాశ్ అక్కడ కూడా దుమ్ము రేపడంతో బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ డివిజన్ మ్యాచుల్లో ఆడే చాన్స్ కొట్టేశాడు.

టర్నింగ్ పాయింట్:

ఓసారి కోల్ కతా రేంజర్స్ గ్రౌండ్ లో మ్యాచులు జరుగుతున్నప్పుడు అప్పటి బెంగాల్ సీనియర్ టీం డైరెక్టర్ జోయ్ దీప్ ముఖర్జీ దృష్టిలో పడ్డాడు. వెంటరు అండక్ 23 కోచ్ సౌరాశిష్ ను పిలిపించి.. ఆకాశ్ గురించి తెలుసుకున్నాడు. అప్పుడు అప్పటి బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ విజన్ 2020 ప్రాంగ్రాంను ప్రారంభించాడు. ఇంకేముంది దానికోసం ముఖర్జీ.. ఆకాశ్ పేరును రిఫర్ చేశాడు. ఇదే అతని కెరీర్ టర్నింగ్ పాయింట్ అయింది. గంగూలీ షార్ట్ లిస్ట్ చేసిన విజన్ 2020 ప్రోగ్రాం జాబితాలో ఆకాశ్ కు చోటు దక్కింది. దీంతో బెంగాల్ రాష్ట్ర జట్టుకు ఆడే అవకాశం దక్కింది. ఆ తర్వాత 2019లో బెంగాల్ తరుపున ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో అడుగుపెట్టాడు. అదే ఏడాది టీ20ల్లో అరంగేట్రం చేశాడు. 2022 నుంచి ఐపీఎల్ లో ఆర్పీబీకి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. పెద్దగా ఆడే అవకాశం రాకపోయినా తన పేరు క్రికెట్ అభిమానులకు పరిచయం అయింది.

ఓవరాల్ గా ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో 29 మ్యచ్ లు ఆడిన ఆకాశ్ 103 వికెట్లు పడగొట్టాడు. ఇటీవల ఇంగ్లాండ్ లయన్స్ తో జరిగిన అనాధికార టెస్ట్ సిరీస్ లో కూడా ఆకాశ్ అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. ఈ సిరీస్ లో ఏకంగా 13 వికెట్లు పడగొట్టాడు. భారత్ ఏ తరుపున లీడింగ్ వికెట్ టేకర్ గా నిలిచాడు.

Updated : 24 Feb 2024 12:29 PM IST
Tags:    
author-thhumb

Kiran

కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.


Next Story
Share it
Top