Sarfaraz Khan: అరంగేట్ర మ్యాచ్లో తుఫాన్ ఇన్నింగ్స్.. ఇంగ్లాండ్ బెండు తీసిన సర్ఫరాజ్ ఖాన్
X
అరంగేట్ర మ్యాచా..! ముందుంది అండర్సనా..? ఆడుతుంది ఇంగ్లాండ్తోనా..? అయితే నాకేంటి. మేరా నామ్ సర్ఫరాజ్ ఖాన్. నేను కాదు నా బ్యాటు, రికార్డులే మాట్లాడుతాయ్.. అంటూ మొదటి మ్యాచులో చెలరేగిపోయాడు. సులువుగా బౌండరీలు బాదుతూ.. క్లిష్టమైన బంతుల్ని చాకచక్యంగా ఎదుర్కొంటూ.. క్రీజులో పాతుకుపోయాడు. ఏ మాత్రం బెరుకు లేకుండా అద్భుత హాఫ్ సెంచరీ చేశాడు. ఇన్నేళ్ల తన నిరీక్షణ, ఆకలిని తీర్చుకున్నాడు. తనను ఎందుకు సెలక్ట్ చేయలేదని బ్యాటుతో ప్రశ్నించాడు. కేవలం 48 బంతుల్లోనే 50 పరుగులు పూర్తిచేసుకున్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మ (131) గొప్ప ఇన్నింగ్స్ కు, జడేజా (96 నాటౌట్) తోడందించాడు.
తర్వాత రోహిత్ ఔట్ అవ్వడంతో క్రీజులోకి వచ్చిన సర్ఫరాజ్ (61 నాటౌట్) దూకుడుగా ఆడుతున్నాడు. 9 ఫోర్లు, 1 సిక్సర్ తో చెలరేగాడు. దీంతో టీమిండియా 310 పరుగుల చేసి.. భారీ స్కోర్ వైపు దూసుకుపోతుంది. ఇంగ్లాండ్ బౌలర్లలో మార్క్ వుడ్ 3 వికెట్లు పడగొట్టగా.. టామ్ హార్ ట్లే ఒక వికెట్ తీసుకున్నాడు. దీంతో భారత్ మొదటి రోజు పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. కాగా టాస్ గెలిచి భారత్ బ్యాటింగ్ ఎంచుకోగా.. 33/3 పీకల్లోతు కష్టాల్లో పడింది. రోహిత్ శర్మ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి భారత్ ను పటిష్ట స్థితికి తీసుకొచ్చాడు.