Home > క్రీడలు > తీవ్ర అనారోగ్యం.. మూడో టెస్టుకు ముందు 10కిలోల బరువు తగ్గిన పడిక్కల్

తీవ్ర అనారోగ్యం.. మూడో టెస్టుకు ముందు 10కిలోల బరువు తగ్గిన పడిక్కల్

తీవ్ర అనారోగ్యం.. మూడో టెస్టుకు ముందు 10కిలోల బరువు తగ్గిన పడిక్కల్
X

స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ గాయం తిరగబడింది. దీంతో అతను మిగతా మూడు మ్యాచులకు దూరమైనట్లు బీసీసీఐ ప్రకటించింది. రాహుల్ స్థానంలో యువ బ్యాటర్ దేవ్ దత్ పడిక్కల్ ను జట్టులోకి తీసుకోనున్నట్లు తెలుస్తుంది. కాగా ఈ నెల 15 నుంచి రాజ్ కోట్ వేదికగా జరగనున్న మ్యాచ్ లో పడిక్కల్ అరంగేట్రం చేయనున్నాడు. ఈ సందర్భంగా మాట్లాడిన పడిక్కల్ టెస్టుల్లో ఆడటం తన కల అని చెప్పాడు. అనారోగ్యం కారణంగా గత సీజన్ లో తీవ్రంగా ఇబ్బంది పడినట్లు చెప్పుకొచ్చాడు. పొత్త కడుపు సమస్యతో ఇబ్బంది పడుతూనే 2022-23 సీజన్ లో ఆడానన్నాడు. ఆ సమయంలో తరచూ అనారోగ్యం బారిన పడటం వల్ల 10 కిలోల బరువు తగ్గినట్లు చెప్పుకొచ్చాడు.

‘టెస్టు జట్టుకు పిలువు రావడాన్ని నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నా. కెరీర్ లో చాలా కఠినమైన సవాళ్లను ఎదుర్కొన్నాక నాకు ఈ అవకాశం వచ్చింది. నా శ్రమ ఫలించినందుకు సంతోషంగా ఉంది. అనారోగ్యం నుంచి కోలుకుని ఫిట్ నెస్ సాధించడం సవాల్ గా మారింది. ఈ క్రమంలో ఏకంగా 10 కిలోల బరువు తగ్గాను. మంచి ఫుడ్ తీసుకుంటూ.. ఫిట్ నెస్ సాధించేందుకు కృషి చేశా’అని పడిక్కల్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీలో.. కర్ణాటక-తమిళనాడు మధ్య జరిగిన మ్యాచులో తొలి ఇన్నింగ్స్ లో 151, రెండో ఇన్నింగ్స్ లో 36 పరుగులు చేశాడు. గతంలో ఇండియా ఏ తరుపున హాఫ్ సెంచరీ సాధించాడు. గతేడాది టీ20ల్లో అరంగేట్రం చేసిన పడిక్కల్.. రెండు మ్యాచుల్లో 38 పరుగులు మాత్రమే చేశాడు.

Updated : 13 Feb 2024 9:15 PM IST
Tags:    
Next Story
Share it
Top