Home > క్రీడలు > CSKకు షాక్.. సగం సీజన్కు స్టార్ బ్యాటర్ దూరం

CSKకు షాక్.. సగం సీజన్కు స్టార్ బ్యాటర్ దూరం

CSKకు షాక్.. సగం సీజన్కు స్టార్ బ్యాటర్ దూరం
X

ఐపీఎల్ సీజన్ స్టార్ట్ కాకముందే చెన్నై సూపర్ కింగ్స్ టీంకు భారీ షాక్ తగిలింది. గత సీజన్ లో డిఫెండింగ్ చాంపియన్ గా నిలిపిన ఓపెనర్ డెవాన్ కాన్వే.. జట్టుకు దూరం అయ్యాడు. బొటనవేలికి గాయం కావడంతో సగం సీజన్ కు అందుబాటులో ఉండడని CSK మేనేజ్మెంట్ ప్రకటించింది. దీంతో CSK ఫ్యూచర్ ఏంటనే ప్రశ్నార్థకంగా మారింది. గత సీజన్ లో గుజరాత్ టైటాన్స్ జరిగిన ఫైనల్‌లో కాన్వే అద్భుత ప్రదర్శన చేశాడు. విధ్వంసకర బ్యాటింగ్‌తో ఫైనల్‌ లో గెలిచేందుకు తోర్పడ్డాడు. ఫాఫ్ డుప్లెసిస్ స్థానాన్ని సమర్థవంతంగా భర్తీ చేస్తూ.. జట్టుకు వెన్నెముకలా నిలబడ్డాడు. అయితే అతని గాయం టీం మేనేజ్మెంట్ ను అయోమయంలో పడేసింది. ఓపెనర్ గా ఎవరికి పంపించాలనే సందిగ్ధంలో పడింది.

సీజన్ మొదలవకముందే CSK ప్లేయర్లు గాయాలతో జట్టుకు దూరం అవడంతో అభిమానుల్లో తీవ్ర నిరాశ మొదలైంది. రీసెంట్ గా కాన్వే లైఫ్ లో కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. తన భార్య కిమ్ వాట్సన్ కు గర్భస్రావం కావడంతో.. పురిట్లోనే బిడ్డను కోల్పోయింది. దాన్నుంచి కోలుకుని కాన్వే ఈ మధ్యే జట్టులో చేరాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో భాగం అయ్యాడు. ఇంతలోనే వెల్లింగ్టన్ వేదికగా ఆసీస్ తో జరిగిన మ్యాచ్ లో గాయం అవడంతో క్రికెట్ కు దూరం అయ్యాడు. కాన్వే కోలుకోవడానికి 8 వారాలు టైం పడుతుందని, మేలో ఫిట్ నెస్ సాధించే అవకాశం ఉందని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డ్ ప్రకటించింది.

మినీ వేలంలో CSK ఈసారి రూటు మార్చింది. టీం మొత్తం సీనియర్లతో నిండిపోయిందనే విమర్శలు రావడంతో.. ఈసారి కుర్రాళ్లును కొనుగోలు చేసింది. రచిన్ రవీంద్ర లాంటి యంగ్స్టర్స్ను సొంతం చేసుకుంది. దీంతో ఈ ఐపీఎల్ కాస్త కొత్త CSKను చూడొచ్చు. కాన్వే జట్టుకు దూరం అవడంతో రుతురాజ్ గైక్వాడ్ తోపాటు ఓపెనర్ గా పంపించాలనే సందిగ్ధంలో పడిపోయారు. అయితే అజింక్యా రహానే, రచిన్ రవీంద్రలను ఓపెనర్ గా దింపాలని CSK మేనేజ్మెంట్ భావిస్తోంది. టీ20ల్లో రెచ్చిపోయే రచిన్.. మంచి స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేయగల సమర్థుడు. రహానే సీనియారిటీ జట్టుకు ప్లస్ అయ్యే అవకాశం ఉంది. అయితే వీళ్లలో ఎవరిని మేనేజ్మెంట్ ఫైనల్ చేస్తుందో చూడాలి. కెప్టెన్ కూల్ ఎంఎస్ ధోనీ ఏం ప్లాన్ చేశాడో? కాన్వే స్థానాన్ని భర్తీ చేసేందుకు ఎవరిని రంగంలోకి దింపుతాడని ఫ్యాన్స్ లో ఆసక్తి మొదలైంది. ధోనీ తన మాస్టర్ మైండో తో పరిస్థితిన చక్కబెడతారని ఆశిస్తున్నారు.






Updated : 4 March 2024 5:36 PM IST
Tags:    
Next Story
Share it
Top