Home > క్రీడలు > ధర్మశాల టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లండ్.. తుది జట్టులో అరంగేట్రం చేసిన పడిక్కల్

ధర్మశాల టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లండ్.. తుది జట్టులో అరంగేట్రం చేసిన పడిక్కల్

ధర్మశాల టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లండ్.. తుది జట్టులో అరంగేట్రం చేసిన  పడిక్కల్
X

భారత్, ఇంగ్లండ్ మధ్య ధర్మశాల వేదికగా జరుగుతున్న ఐదవ టెస్ట్ మ్యాచ్‌లో టాస్ గెలిచి ఇంగ్లీష్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. టీమిండియా యువ క్రికెటర్ దేవ్‌దత్ పడిక్కల్ ఈ మ్యాచ్‌తో అరంగేట్రం చేస్తున్నాడు. సిన్నర్ రవీంద్ర అశ్విన్, ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ బెయిర్‌స్టోకు ఇది వందో టెస్టు. ఈ సిరీస్‌లో టీమిండియా ఇప్పటికే 3-1తో అధిక్యంలో ఉంది. అత‌డు ఈ మ్యాచ్‌తో టెస్టుల్లో అరంగేట్రం చేయ‌నున్నాడు. ఆకాశ్ దీప్ స్థానంలో ఏస్ పేస‌ర్ బుమ్రా జ‌ట్టులోకి వ‌చ్చాడు. అంతేకాదు భార‌త స్పిన్న‌ర్ అశ్విన్‌, ఇంగ్లండ్ ఆట‌గాడు జానీ బెయిర్‌స్టోకు ఇది వందో మ్యాచ్ కావ‌డం విశేషం.బుమ్రా తిరిగి అందుబాటలోకి రావడంతో ఆకాష్ దీప్ నుంచి పక్కనపెట్టామని వివరించాడు. ఇక రజత్ పటీదార్ గాయపడడంతో అతడి స్థానంలో దేవదత్ పడిక్కల్ అరంగేట్రం చేయబోతున్నట్టు చెప్పాడు. ఇక 100వ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న రవిచంద్రన్ అశ్విన్ నిజమైన దిగ్గజ క్రికెటర్ అని రోహిత్ శర్మ అన్నాడు. దేశానికి, కుటుంబానికి గర్వకారణమని అభిప్రాయపడ్డాడు. మ్యాచ్‌కు ముందు నిర్వహించిన కార్యక్రమంలో కోచ్ రాహుల్ ద్రవిడ్ చేతుల మీదుగా ప్రత్యేగా క్యాప్‌ను అందుకున్నారు. ఈ సందర్బంగా అశ్విన్‌తో భార్య, పిల్లలు ఉన్నారు.

తుది జట్లు..

భారత్: యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(కెప్టెన్), శుభమాన్ గిల్, దేవదత్ పడిక్కల్, రవీంద్ర జడేజా, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా.

ఇంగ్లండ్..

జాక్ క్రాలే, బెన్ డకెట్, ఒల్లీ పోప్, జో రూట్, బెన్ స్టోక్స్(కెప్టెన్ ), జానీ బెయిర్‌స్టో, బెన్ ఫోక్స్(వికెట్ కీపర్), టామ్ హార్ట్లీ, షోయబ్ బషీర్, మార్క్ వుడ్, జేమ్స్ అండర్సన్.

Updated : 7 March 2024 5:38 AM GMT
Tags:    
author-thhumb

Kiran

కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.


Next Story
Share it
Top