Home > క్రీడలు > భారత్ జట్టులోకి ధోని రీ ఎంట్రీ..!

భారత్ జట్టులోకి ధోని రీ ఎంట్రీ..!

భారత్ జట్టులోకి ధోని రీ ఎంట్రీ..!
X

భారత్‌కు రెండు ఐసీసీ ట్రోఫీలు అందించిన కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని. 1983 తర్వాత అందని ద్రాక్షలా ఉన్న వరల్డ్ కప్‌ను భారత్ ముద్దాడింది ధోని హయాంలోనే. 2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్‌‌లను టీమిండియాకు ధోని అందించాడు. 2013 ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీని కూడా భారత్ ధోని సారథ్యంలో గెలుచుకుంది. ఆతర్వాత ఇప్పటి వరకు మరో ఐసీపీ ట్రోఫీని ఏ కెప్టెన్ సాధించలేకపోయాడు. విరాట్, రోహిత్ శర్మ సారథ్యంలో భారత్ అంచనాలను అందుకోలేకపోయింది. పలుమార్లు అవకాశం వచ్చినా అదృష్టం కలిసిరాలేదు. సుమారు 10 సంవత్సరాలుగా ఐసీపీ ట్రోఫీ కోసం భారత్ ఆరాటపడుతోంది. దీంతో ఆక్టోబర్‌లో జరిగిగే వన్డే వరల్డ్ కప్ 2023ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. స్వదేశంలో ఎలాగైనా ప్రపంచ కప్ గెలిచి తీరాలనే ఉద్దేశ్యంతో ఇప్పటి నుంచే జట్టు మేనేజ్‌మెంట్ వ్యూహాలు సిద్ధం చేస్తోంది.

వరల్డ్ కప్ కోసం ధోనిని రంగంలోకి దించాలని బీసీసీఐ భావిస్తోంది. విజయవంతమైన కెప్టెన్‌లలో ఒక్కడైన ధోని సేవలను వినియోగించుకోవాలని ఆలోచన చేస్తోంది. ఈ మేరకు జట్టు మెంటర్‌గా నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో 2021 టీ20 వరల్డ్ కప్‎కు భారత్ జట్టు మెంటర్ ధోనిని బీసీసీఐ నియమించింది. ఆ టోర్నిలో టీమిండియా లీగ్ దశలోనే నిష్క్రమించింది. కానీ మరోసారి ఇప్పుడు మహేంద్రుడి అనుభవాన్ని, వ్యూహాలను ఉపయోగించుకోవాలని జట్టు మేనేజ్‌మెంట్ చూస్తోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే ధోని టీమిండియా జెర్సీలో మెరవనున్నాడు. ఈ వార్త విన్న ధోని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Updated : 22 Jun 2023 4:00 PM IST
Tags:    
Next Story
Share it
Top