Home > క్రీడలు > Dhoni : భారత టూరిజానికి ముందు ప్రాధాన్యత ఇవ్వండి: MS ధోనీ

Dhoni : భారత టూరిజానికి ముందు ప్రాధాన్యత ఇవ్వండి: MS ధోనీ

Dhoni : భారత టూరిజానికి ముందు ప్రాధాన్యత ఇవ్వండి: MS ధోనీ
X

లక్షద్వీప్, మాల్దీవుల వివాదం రోజు రోజుకు ఎక్కువవుతుంది. ప్రధాని మోదీ లక్షద్వీప్ ను పర్యటించిన తర్వాత.. కొంతమంది మాల్దీవుల నేతలు భారత్ పై తీవ్ర వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. అవికాస్త వివాదాస్పదం అవడంతో.. ఆ నేతలను మాల్దీవ్స్ ప్రభుత్వం పదవుల నుంచి తప్పించింది. కాగా ఈ వ్యాఖ్యలపై భారత సినీ, క్రీడా రంగ ప్రముఖులు తీవ్రంగా ఖండిస్తున్నారు. మాజీ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, ఇర్ఫాన్‌ పఠాన్‌, సురేశ్ రైనా, బాలీవుడ్ దిగ్గజం అమితాబ్‌ బచ్చన్‌ ఇప్పటికే గట్టి కౌంటర్‌ ఇచ్చారు. భారత్ లో మాల్దీవ్స్ కు మించిన అందమైన ప్రదేశాలు ఉన్నాయని, వాటిని పర్యాటకం రంగం మద్దతు కావాలని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోనీ.. భారత పర్యటనపై మాట్లాడిన వీడియో ఒకటి వైరల్ అవుతుంది.

‘రిటైర్మెంట్ ప్రకటించనప్పుడు మ్యాచులు ఆడటానికి చాలా దేశాలకు వెళ్లేవాన్ని. అలా ప్రయాణాలు ఎక్కువగా చేశాను. కానీ వెకేషన్స్ కు మాత్రం ఎక్కువగా వెళ్లలేదు. అక్కడ ఎక్కువగా ఎంజాయ్ చేయకుండా.. మ్యాచ్ లు ముగియగానే స్వదేశానికి తిరిగొచ్చేవాన్ని. అయితే సాక్షికి ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. అయినా ఎక్కువగా బయటికి వెళ్లలేదు. రిటైర్ అయిన తర్వాత ఇప్పుడు కాస్త టైం దొరుకుతుంది. టూర్స్ వెళ్లడానికి ప్లాన్ చేస్తున్నాం. ఇండియా నుంచే మా టూర్ మొదలుపెట్టాలనుకున్నాం. మన దగ్గర చాలా అందమైన ప్రదేశాలు ఉన్నాయి. అందుకే ఇతర దేశాలకు వెళ్లేముందు ముందు మన దేశంలో ఉన్న ప్రదేశాలను చుట్టేయాలనుకుంటున్నాం’ అని చెప్పుకొచ్చాడు.





Updated : 9 Jan 2024 5:24 PM IST
Tags:    
Next Story
Share it
Top