Home > క్రీడలు > Dhoni : చెపాక్లో ప్రాక్టీస్ మొదలు పెట్టిన ధోని..వీడియో వైరల్

Dhoni : చెపాక్లో ప్రాక్టీస్ మొదలు పెట్టిన ధోని..వీడియో వైరల్

Dhoni : చెపాక్లో ప్రాక్టీస్ మొదలు పెట్టిన ధోని..వీడియో వైరల్
X

ధోని..ఈ పేరు వింటే చాలు గ్రౌండ్ అంతా మారుమోగిపోతుంది. మైదానంలో మహీ అడుగుపెట్టగానే అభిమానులు పూనకంతో ఊగిపోతారు. అయితే నాలుగు పదుల్లోనూ ఇప్పుడు మరో ఐపీఎల్ ఆడేందుకు రెడీ మిస్టర్ కూల్ అవుతున్నాడు. సీఎస్ కే హోమ్ గ్రౌండ్ చెన్నైలో నెట్ ప్రాక్టీస్ మొదలుపెట్టాడు ధోని. ఐపీఎల్ లో మహీ అభిమానులు తనను ముద్దుగా తల అని పిలుచుకుంటారు. సంవత్సరం తర్వాత చెపాక్ స్టేడియంలో అడుగు పెడుతున్నాం అంటూ మహీ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోని చెన్నై సూపర్ కింగ్స్ తన అధికారిక ఖాతాలో పోస్ట్ చేసింది. అయితే ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.





మరి కొన్ని రోజుల్లో ఐపీఎల్ ప్రారంభం కానుంది. డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగుతోంది చెన్నై సూపర్ కింగ్స్. అయితే నాలుగు పదుల వయసులోనూ కుర్రాళ్లకు ఏ మాత్రం తగ్గకుండా ఫిట్ నెస్ మెంటేన్ చేస్తున్నాడు మిస్టర్ కూల్. చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్ స్టార్ట్ కానుంది. ఈ మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ సీఎస్కే తో ఆర్సీబీ తలపడనుంది. అయితే మహీకి ఇదే చివరి ఐపీఎల్ అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. దీంతో మహీ సారథ్యంలో మరోసారి కప్ కొట్టేలని టీమ్ భావిస్తోంది.

అయితే చెన్నైలో సీఎస్కే టీమ్ ప్రాక్టీస్ వీడియోని ట్వీటర్ లో పోస్ట్ చేసింది ఆ టీమ్ మ్యానెజ్మెంట్. తల వచ్చేస్తున్నాడు విజిల్ పోడు, ఎల్లో లవ్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. లాంగ్ హెయిర్ వింటేజ్ లుక్ తో అదరగొడుతున్నాడు. దీంతో వింటేజ్ తల ఈజ్ బ్యాక్ అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.



Updated : 9 March 2024 3:50 PM IST
Tags:    
Next Story
Share it
Top