Home > క్రీడలు > ఐపీఎల్‌పై ధోనీ ఆసక్తికర పోస్ట్

ఐపీఎల్‌పై ధోనీ ఆసక్తికర పోస్ట్

ఐపీఎల్‌పై ధోనీ ఆసక్తికర పోస్ట్
X

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ తన ఫేస్‌బుక్ అకౌంట్‌లో ఆసక్తికర పోస్ట్ పెట్టాడు. కొత్త సీజన్, కొత్త రోల్ కోసం వేచిచూడలేకపోతున్నాను. వేచి ఉండండి’’ అంటూ ధోనీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అయితే కొత్త పాత్ర ఏంటనేది చర్చనీయాంశమైంది. ధోనీ రిటైర్మెంట్ ప్రకటించి చెన్నై జట్టుకు కోచ్‌గా ఉంటాడని కోచ్ కాదు మెంటార్‌గా ఉంటాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా ఐపీఎల్-2024లో ఎంఎస్ ధోనీ ఆడతాడని అంతా భావించారు. 2023లోనే రిటైర్మెంట్ ఉంటుందని అంచనా వేసినప్పటికీ ధోనీ నుంచి ప్రకటన వెలువడలేదు. గత సీజన్‌లో ధోనీ నాయకత్వంలో చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ విజేతగా నిలిచింది. ఆ తర్వాత ధోనీ మోకాలి శస్త్రచికిత్స చేయించుకున్నాడు.

ఇటీవలే అతడి ప్రాక్టీస్‌కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. దీంతో 2024 సీజన్‌లో ఆడడం ఖాయమని అంతా భావించారు. ఈ సమయంలో ధోనీ పెట్టిన పోస్టు క్రికెట్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. కాగా చెన్నై సూపర్‌కింగ్స్‌ని ధోనీ ఐదుసార్లు టైటిల్ విజేతగా నిలిపాడు. ఐపీఎల్-2023 ఫైనల్ మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. అభిమానుల ప్రేమ కోసం ఆటను కొనసాగిస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. సాధారణంగా సోషల్ మీడియాకు దూరంగా ఉండే ధోనీ ఈ కీలక తరుణంలో చేసిన ఈ పోస్ట్ చర్చనీయాంశంగా మారింది. రకరకాల ఊహాగానాలకు ఈ పోస్ట్ కారణమవుతోంది. ఈ సీజన్‌లో ధోనీ కోచ్ పాత్రకు పరిమితం కాబోతున్నాడని తెలుస్తోంది.

Updated : 4 March 2024 9:11 PM IST
Tags:    
Next Story
Share it
Top