MS Dhoni Number 7Jersey: ధోనీకి అరుదైన గౌరవం.. నంబర్ 7 జెర్సీపై బీసీసీఐ కీలక నిర్ణయం
X
భారత క్రికెట్ లో అత్యుత్తమ కెప్టెన్, ప్రపంచంలో బెస్ట్ కీపర్ ఎవరంటే టక్కున గుర్తొచ్చే పేరు ఎంఎస్ ధోనీ. ఒక కెప్టెన్ గా, ఆటగాడిగా టీమిండియాకు అతను చేసిన సేవలు ఎవరూ.. ఎప్పటికీ మర్చిపోలేరు. 2007లో జరిగిన తొలి టీ20 వరల్డ్ కప్, 2011లో జరిగిన వన్డే వరల్డ్ కప్, 2013లో చాంపియన్స్ ట్రోఫీలను అందించాడు. భారత క్రికెట్ జట్టుకు మూడు ప్రపంచ కప్ ట్రోఫీలు అందించిన కెప్టెన్ గా నిలిచాడు. అయితే 2019లో ఇంగ్లాండ్ గడ్డపై జరిగిన వన్డే వరల్డ్ కప్ సెమీస్ ఫైనల్ ఓటమి తర్వాత జట్టుకు దూరంగా ఉన్న ధోనీ.. 2020 ఆగస్టు 15న క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ క్రమంలో అతను సాధించిన విజయాలకు గుర్తుగా, అరుదైన గౌరవంగా బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ధోనీ జెర్సీ నెంబర్ 7కు రిటైర్మెంట్ ప్రకటించింది.
దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ నంబర్ 10 జెర్సీకి చాలా ప్రాముఖ్యత ఉంది. సచిన్ రిటైరైన తర్వాత అతని జెర్సీ నంబర్ 10కి.. బీసీసీఐ రిటైర్మెంట్ ప్రకటించింది. సచిన్ పై ఉన్న గౌరవంతో భవిష్యత్ లో ఏ భారత క్రికెటర్ కు ఆ నెంబర్ జెర్సీని నెంబర్ ను కేటాయించబోమని బీసీసీఐ చెప్పుకొచ్చింది. ఇదే తరహాలో ఇప్పుడు ధోనీ జెర్సీ నంబర్ 7కు కూడా రిటైర్మెంట్ ఇవ్వాలని పలువురు మాజీ క్రికెటర్లు బీసీసీఐని కోరారు. ధోనీ ఫ్యాన్స్ నుంచి కూడా తరచూ ఈ డిమాండ్ వినిపించింది. తాజాగా బీసీసీఐ ఆ డిమాండ్ ను అమలుచేసింది. ధోనీ జెర్సీ నంబర్ 7కి రిటైర్ ఇచ్చింది. ఈ నిర్ణయంతో ఇకపై టీమిండియాలో కొత్త కుర్రాళ్లెవరూ నంబర్ 7, నంబర్ 10 జెర్సీలను ఎంపిక చేసుకొనే అవకాశం ఉండదు.