CNG, iCNG కార్ల మధ్య తేడా ఏంటి? వీటిలో ఏ కారు ఎక్కువ మైలేజ్ ఇస్తుంది?
X
(CNG Car Vs iCNG Car) పెట్రోల్, డీజిల్ ధరలు రోజు రోజులు ఆకాశాన్ని అంటుతుండడంతో.. CNG కార్లకు డిమాండ్ బాగా పెరిగిపోయింది. కంపెనీలు తమ కార్లలో CNG వేరియంట్ ను తీసుకురావడానికి కూడా ఇదే కారణం. ఈ క్రమంలో ఇటీవల iCNG కార్లు కూడా వేగంగా అభివృద్ది చెందుతున్నాయి. CNG కార్లతో పాటు మార్కెట్ లో iCNG కార్లు కూడా కనిపిస్తున్నాయి. దీంతో వినియోగదారుల్లో కన్ ఫ్యూజన్ మొదలైంది. CNG కారు కొనలా? లేక iCNG కారు కొనాలా అనే అయోమయంలో పడిపోయారు. అయితే చాలామందికి CNG, iCNG కార్ల మధ్య తేడా తెలియదు. ఈ రెండింటి మధ్య తేడా ఏంటీ? వీటిలో ఏదీ కొంటే మంచి మైలేజీ ఇస్తుందనే విషయాలను తెలుసుకుందాం.
CNG, iCNG కార్ల మధ్య తేడా ఏంటంటే.. CNG కారు ఇంజిన్ పెట్రోల్, CNG రెండింటితో నడుస్తుంది. iCNG కార్ల లో ఇంజిన్ తో పాటు ఎలక్ట్రిక్ మోటార్ కూడా ఫిక్స్ చేసి ఉంటుంది. ఇది కారుకు ఎక్స్ ట్రా పవర్ ను ఇస్తుంది. దాంతో కారు పవర్, మైలేజీ కూడా పెరుగుతుంది. iCNG కార్లు CNG కార్లకంటే 12 నుంచి 15 శాతం ఎక్కువ మైలేజీని ఇస్తాయి. ఒక CNG కారు ఒక కిలో CNGకి 20 కిలోమీటర్ల మైలేజీని ఇస్తే.. iCNG కారు 22-23 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. దీనికారణంగా సాధారణ CNG కార్లతో పోల్చితే.. iCNG కార్లు పొల్యూషన్ ఫ్రీ. అయితే iCNG కార్లు ధర ఎక్కువే. కానీ iCNG కార్లను నడిపడానికి అయ్యే ఖర్చు.. CNG కార్లతో పోల్చితే చాలా తక్కువ.