కొత్త చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ జీతమెంతంటే...!
X
కొత్త చీఫ్ సెలెక్టర్‌గా అజిత్ అగార్కర్‌ను బీసీసీఐ ఎంపిక చేసింది. ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్ నేపథ్యంలో అగార్కర్ సరైన ఎంపిక అని అంతా భావిస్తున్నారు. అంతర్జాతీయ క్రికెట్ లో సుదీర్ఘ అనుభవం, గతంలో ముంబై జట్టుకు చీఫ్ సెలక్టర్‌గా, ఐపీఎల్‌లో ఢిల్లీకి సహాయక కోచ్ పనిచేసిన అంశాలు అగార్కర్‌ను సెలెక్టర్ ఎంపిక చేసేందుకు దోహదపడ్డాయి.
ఇక చీఫ్ సెలెక్టర్‌గా ఎంపికైన అజిత్ అగార్కర్ జీతంపై సర్వతా చర్చ నడుస్తోంది. అగార్కర్ కోసం బీసీసీఐ జీతాన్ని భారీగా పెంచినట్లు సమాచారం. ఇప్పటివరకు బీసీసీఐ చీఫ్ సెలక్టర్‌కు రూ. కోటి పారితోషికం చెల్లిస్తున్నారు. చీఫ్ సెలెక్టర్ కాకుండా మిగతా వారికి రూ.90 లక్షల చొప్పున ఏడాదికి చెల్లిస్తారు. అయితే అగార్కర్‌కు మాత్రం ఏడాదికి రూ.3 కోట్లు చెల్లించేందుకు ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. క్రికెట్ విశ్లేషకుడు, వ్యాఖ్యాతగా ప్రస్తుతం అగార్కర్ సంపాదన ఎక్కువ ఉండడంతో బీసీసీఐ కూడా అంతే స్థాయిలో జీతాన్ని ఇచ్చేందుకు అంగీకరించింది.
టీమిండియా తరపున 1998లో అరంగేట్రం చేసిన అగార్కర్ 2007 వరకు ప్రాతినిధ్యం వహించాడు. 9 ఏళ్ల కెరీర్‌లో అగార్కర్ 26 టెస్టులు, 191 వన్డేలు, నాలుగు టి20 మ్యాచ్‌లు ఆడాడు. మూడు ఫార్మాట్లలో కలిపి 349 వికెట్లు, 1,800కిపైగా పరుగులు చేసిన అగార్కర్ సొంతం చేసుకున్నాడు. 2007 టి20 వరల్డ్‌కప్‌ను గెలిచిన భారత్ జట్టులో అగార్కర్ కూడా సభ్యుడిగా ఉన్నాడు. టీమిండియా తరపున వన్డేల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ ఇప్పటికి అజిత్ అగార్కర్ పేరిటే ఉంది. 23 సంవత్సరాలు అవతున్నా అగార్కర్ రికార్డు చెక్కుచెదర్లేదు. . 2000వ సంవత్సరంలో జింబాబ్వేతో వన్డేలో అగార్కర్ కేవలం 21 బంతుల్లోనే 50 పరులు చేశాడు. అదే విధంగా అతి తక్కువ వన్డేల్లో(23 మ్యాచ్‌ల్లో) 50 వికెట్ల మైలురాయిని అందుకున్న బౌలర్‌గా అగార్కర్ నిలిచాడు.