Home > క్రీడలు > పుజారా సెంచరీ...సెలెక్టర్లకు బ్యాట్‎తోనే సమాధానం..

పుజారా సెంచరీ...సెలెక్టర్లకు బ్యాట్‎తోనే సమాధానం..

పుజారా సెంచరీ...సెలెక్టర్లకు బ్యాట్‎తోనే సమాధానం..
X

భారత జట్టు నుంచి తొలగించబడిన తరువాత చెతేశ్వర్ పుజారా అదరగొట్టాడు. దులీప్ ట్రోఫీలో ఆడిన మొదటి మ్యాచ్ లోనే శతకం బాదేశాడు. వెస్ట్ జోన్ తరఫున ఆడుతున్న పుజారా సెంట్రల్​ జోన్‌పై సెంచరీ సాధించాడు. ఇది పుజారాకు ఫస్ట్​ క్లాస్ కెరీర్​లో 60వ సెంచరీ కావడం విశేషం.

మూడో రోజు కొనసాగుతున్న ఆటలో పుజారా ప్రస్తుతం.. 132 పరుగులతో (14 ఫోర్లు, 1 సిక్స్) క్రీజులో ఉన్నాడు. పుజరా సెంచరీతో పాటు, మరో భారత ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ (50) అర్థసెంచరీ చేయడంతో వెస్ట్‌జోన్ 9 వికెట్లు కోల్పోయి 292 పరుగులు చేసింది. ప్రస్తుతం వెస్ట్ జోన్ 384 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఈ సమయంలో వర్షం రావడంతో మ్యాచ్‌ను నిలిపివేశారు. అంతకుముందు వెస్ట్ జోన్ తన మొదటి ఇన్నింగ్స్‌లో 220 పరుగులకే ఆలౌట్ అయ్యింది. శివమ్ మావి 6 వికెట్లతో చెలరేగాడు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన సెంట్రలో జోన్ 128 పరుగులకే కుప్పకూలింది.

డబ్ల్యూటీసీ ఫైనల్‌లో విఫలమైన బ్యాట్స్‌మెన్ ఛెతేశ్వర్ పుజారా పై బీసీసీఐ సెలక్షన్ కమిటీ వేటు వేసింది. విండీస్ పర్యటనకు టీమ్ఇండియా టెస్టు జట్టులో పుజారాకు టీమ్ఇండియా సెలెక్టర్లు మొండి చేయి చూపారు. దీంతో దులీఫ్ ట్రోఫీలో పుజారా అడుగుపెట్టాడు. ఒక్క ఇన్నింగ్స్‌తో పుజారా సెలెక్టర్లతో పాటు తన బ్యాటింగ్ పై విమర్శలు చేసిన వారికి గట్టిగా సమాధానిమిచ్చాడు.


Updated : 7 July 2023 5:39 PM IST
Tags:    
Next Story
Share it
Top