IND vs ENG: డేంజర్లో ఇంగ్లాండ్.. మరో మ్యాచ్ ఓడితే ఐసీసీ టోర్నీకి దూరం
X
డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లాండ్ కు వరుసగా షాక్ లు తగులుతున్నాయి. వరల్డ్ కప్ లో చిన్న జట్ల చేతిలో ఓటమి.. వరుస పరాజయాలతో పాయింట్స్ టేబుల్ లో చివరి స్థానం.. సెమీస్ కు క్వాలిఫై అయ్యే అవకాశం కోల్పోవడం.. ఇవన్నీ పక్కనపెడితే.. మరో పిడుగులాంటి వార్తను ఐసీసీ ప్రకటించింది. దీంతో ఇంగ్లాండ్ కు కొత్త టెన్షన్ పట్టుకుంది. ఇప్పటికే ఈ వరల్డ్ కప్ సెమీ ఫైనల్ కు చేరే అవకాశం చేజారగా.. మరో మెగా టోర్నీలో పాల్గొనే అవకాశాన్ని చేజార్చుకునేలా కనిపిస్తుంది.
2025లో పాకిస్తాన్ వేదికగా జరగబోయే చాంపియన్స్ ట్రోఫీకి ఇంగ్లాండ్ దూరం కానుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. చాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించాలంటే.. వరల్డ్ కప్ లో టాప్ 8 జట్లలో ఒకటిగా ఉండాలి. అయితే ప్రస్తుతం ఆడిన ఆరు మ్యాచుల్లో ఐదిట్లో ఓడిపోయిన ఇంగ్లాండ్ పాయింట్స్ టేబుల్ లో చివరి స్థానంలో ఉంది. ఆ జట్టు మిగిలిన 3 మ్యాచుల్లో గెలిచినా.. మిగతా జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. అంటే ఆఫ్ఘనిస్తాన్, నెదర్లాండ్స్, బంగ్లాదేశ్ జట్లు ఆడే మ్యాచుల్లో ఓడిపోవాలి. ఇంగ్లాండ్ కు మిగిలున్న మూడు మ్యాచుల్లో గెలవాల్సి ఉంటుంది. దీన్నిబట్టి చూసుకుంటే ఇంగ్లాండ్ ఆశలు దాదాపు గాల్లో కలిసినట్లే. ఎందుకంటే తర్వాత మ్యాచ్ లు ఆస్ట్రేలియా, శ్రీలంక, నెదర్లాండ్స్ జట్లతో ఆడాల్సి ఉంటుంది.
Kiran
కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.