Home > క్రీడలు > బెన్ స్టోక్స్ సెంచరీ.. నెదర్లాండ్స్ టార్గెట్ ఎంతంటే..?

బెన్ స్టోక్స్ సెంచరీ.. నెదర్లాండ్స్ టార్గెట్ ఎంతంటే..?

బెన్ స్టోక్స్ సెంచరీ.. నెదర్లాండ్స్ టార్గెట్ ఎంతంటే..?
X

పూణే వేదికగా నెదర్లాండ్స్తో జరుగుతున్న మ్యాచ్లో ఇంగ్లాండ్ దంచికొట్టింది. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్.. 50 ఓవర్లకు 339 రన్స్ చేసింది. బెన్ స్టోక్స్ 108 రన్స్తో నెదర్లాండ్స్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. డేవిడ్ మలన్ 87, క్రిస్ వోక్స్ 51 రన్స్తో రాణించారు. నెదర్లాండ్స్ బౌలర్లో బాస్ డి లీడే 3 వికెట్లు పడగొట్టగా.. ఆర్యన్ దత్ 2,లోగాన్ వాన్ బీక్ 2, పాల్ వాన్ మీకెరెన్ ఒక వికెట్ తీశారు.

నెదర్లాండ్స్ జట్టు సెమీస్ కోసం ఆడుతుంటే.. ఇంగ్లీష్ జట్టు మాత్రం పాయింట్స్ టేబుల్లో పైకి ఎక్కేందుకు ప్రయత్నిస్తోంది. మిగిలిన రెండు మ్యాచుల్లో గెలిచి చాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించాలని ప్రయత్నిస్తుంది. ఈ మ్యాచ్కు మార్క్ ఉడ్, లివింగ్ స్టోన్ దూరం అయ్యారు. వారి స్థానంలో బ్రూక్స్, అట్కిన్సన్ ఆడుతున్నారు. నెదర్లాండ్స్కు మిగిలిన రెండు మ్యాచుల్లో గెలిస్తే సెమీస్ రేసులో ఉంటుంది. లేకపోయినా.. చాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధిస్తుంది. ఇప్పటివరకు జరిగిన మ్యాచుల్లో చిన్న జట్ల చేతుల్లో ఇంగ్లాండ్ ఓడిపోతుంటే.. నెదర్లాండ్స్ సౌతాఫ్రికా లాంటి పెద్ద జట్లకు షాక్ ఇచ్చింది.


Updated : 8 Nov 2023 6:04 PM IST
Tags:    
Next Story
Share it
Top