Home > క్రీడలు > IND vs ENG విజృంభించిన బుమ్రా, షమీ.. కష్టాల్లో ఇంగ్లాండ్

IND vs ENG విజృంభించిన బుమ్రా, షమీ.. కష్టాల్లో ఇంగ్లాండ్

IND vs ENG విజృంభించిన బుమ్రా, షమీ.. కష్టాల్లో ఇంగ్లాండ్
X

ఈజీ టార్గెటే అయినా.. ఇంగ్లాండ్ కు మాత్రం అగ్ని పరీక్ష. పీకల్లోతు ఒత్తిడే. ఎందుకంటే.. ముందుంది టీమిండియా. టోర్నీ మొత్తంలో బ్యాటింగ్.. బౌలింగ్ లో సత్తా చాటుతూ, ఆడిన ఐదు మ్యాచుల్లో గెలిచింది. ఈ క్రమంలో ఇంగ్లాండ్ పసికూనల చేతుల్లో ఓడిపోయి పరువు పోగొట్టుకుంది. కాగా ఈ మ్యాచ్ లో భారత్ ను 229 పరుగులకే కట్టడి చేసినా.. ఒత్తిడి మాత్రం తప్పడంలేదు. టీమిండియా పేస్ దళం బుమ్రా, షమీ విజృంభించడంతో ఇంగ్లాండ్ పీకల్లోతు కష్టాల్లో పడింది. 14 ఓవర్లలో 49 పరుగులు మాత్రమే చేసి 4 కీలక వికెట్లు కోల్పోయింది.

బుమ్రా, షమీ చెరో రెండు వికెట్లు తీసుకుని సత్తాచాటారు. మొదటి ఓవర్లలో ఇంగ్లాండ్ ఓపెనర్లు డేవిడ్ మలాన్ (16), బెయిస్ట్రో (14) కాస్త ఇబ్బంది పెట్టినా.. బుమ్రా, షమీ వాళ్లను క్లీన్ బౌల్డ్ చేసి మ్యాచ్ ను మలుపుతిప్పారు. తర్వాత వచ్చిన రూట్, బెన్ స్టోక్స్ డకౌట్ అయ్యారు. దీంతో మ్యాచ్ పూర్తిగా టీమిండియా చేతుల్లోకి వచ్చింది. 5 ఓవర్లు వేసిన సిరాజ్ 26 పరుగులు ఇచ్చుకున్నాడు. కుల్దీప్ కట్టుదిట్టంగానే బౌలింగ్ చేశాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ బ్యాటర్లు బట్లర్ (10), మోయిన్ అలీ (6) క్రీజులో ఉన్నారు.

Updated : 29 Oct 2023 8:16 PM IST
Tags:    
Next Story
Share it
Top