Home > క్రీడలు > England vs Sri Lanka: బ్యాటింగ్ స్టార్ట్ చేసిన ఇంగ్లాండ్.. గెలిస్తేనే సెమీస్‌కు..

England vs Sri Lanka: బ్యాటింగ్ స్టార్ట్ చేసిన ఇంగ్లాండ్.. గెలిస్తేనే సెమీస్‌కు..

England vs Sri Lanka: బ్యాటింగ్ స్టార్ట్ చేసిన ఇంగ్లాండ్.. గెలిస్తేనే సెమీస్‌కు..
X

డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ జట్టు వన్డే ప్రపంచకప్ 2023లో ముందుకు వెళ్లేది లేనిది నేటితో తేలనుంది. గురువారం బెంగుళూరు వేదికగా ఆ జట్టు.. శ్రీలంకతో తలపడుతోంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ సారథి జోస్ బట్లర్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఒపేనర్లుగా డేవిడ్ మలన్, జానీ బెయిర్స్టో బరిలోకి దిగారు. ఇక గత మ్యాచ్ లో బెంచ్ కు పరిమితమైన మోయిన్ అలీ, క్రిస్ వోక్స్, లివింగ్‌స్టోన్ తిరిగి ఇంగ్లాండ్ జట్టులో చేరగా.. లంక జట్టుకు ఏంజెలో మాథ్యూస్ తోడయ్యాడు. ఇరు జట్లకూ కూడా ఈ మ్యాచ్ డూ ఆర్ డై లాంటిదే. ఇందులో గెలిచిన జట్టు సెమీస్ ఆశలు సజీవంగా ఉంచుకుంటుంది.

ఈ టోర్నీలో రెండు జట్లూ కూడా నాలుగు మ్యాచులు ఆడేశాయి. అందులో ఒక విజయం మాత్రమే సాధించాయి. దీంతో పాయింట్ల పట్టికలో 7, 8వ స్థానాల్లో శ్రీలంక, ఇంగ్లాండ్ జట్లు ఉన్నాయి. ఈ మ్యాచులో గెలిచిన జట్టు తన స్థానాన్ని మెరుగుపర్చుకోనుంది.

వన్డే వరల్డ్ కప్ చరిత్రలో ఇఫ్పటివరకు ఇంగ్లాండ్-శ్రీలంక జట్లు 11 మ్యాచుల్లో తలపడ్డాయి. అందులో ఇంగ్లాండ్ 6 మ్యాచుల్లో, శ్రీలంక ఒక మ్యాచులో గెలుపొందాయి. అయితే 1999 నుంచి ఇప్పటివరకు శ్రీలంక వరుసగా మూడు మ్యాచుల్లో ఇంగ్లాండ్‌ను ఓడించింది.

తుది జట్లు

శ్రీలంక: పతుమ్ నిస్సంక, కుసల్ పెరీరా, కుసాల్ మెండిస్(కెప్టెన్ & వికెట్ కీపర్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డిసిల్వా, ఏంజెలో మాథ్యూస్, మహేశ్ తీక్షణ, కసున్ రజిత, లహిరు కుమార, దిల్షన్ మదుశంక.

ఇంగ్లాండ్: డేవిడ్ మలన్, జానీ బెయిర్‌స్టో, జో రూట్, బెన్ స్టోక్స్, లియామ్ లివింగ్‌స్టోన్, జోస్ బట్లర్ (కెప్టెన్ & వికెట్ కీపర్), డేవిడ్ విల్లీ, మొయిన్ అలీ, క్రిస్ వోక్స్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్.






Updated : 26 Oct 2023 2:13 PM IST
Tags:    
Next Story
Share it
Top