ఎట్టకేలకు గెలుపు.. నెదర్లాండ్స్ను చిత్తు చేసిన ఇంగ్లాండ్..
X
పూణే వేదికగా నెదర్లాండ్స్తో జరిగిన మ్యాచ్లో ఇంగ్లాండ్ ఘనవిజయం సాధించింది. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్.. 50 ఓవర్లకు 339 రన్స్ చేసింది. 340 లక్ష్యంతో బరిలో దిగిన నెదర్లాండ్స్ 179కే ఆలౌట్ అయ్యింది. తేజ నిడమనూరు 41, వెస్లీ బరేసి 37, సిబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్ 33, స్కాట్ ఎడ్వర్డ్స్ 38 రన్స్ చేశారు. మిగితా బ్యాట్స్మెన్స్ అంతా సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. ఇంగ్లాండ్ బౌలర్లలో మొయిన్ అలీ 3, ఆదిల్ రషీద్ 3 వికెట్లు పడగొట్టగా.. డేవిడ్ విల్లీ 2 క్రిస్ వోక్స్ ఒక వికెట్ తీశారు.
ఐదు ఓటముల తర్వాత ఇంగ్లాండ్ ఈ మ్యాచ్ గెలిచింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన బట్లర్ సేన 339 రన్స్ చేసింది. బెన్ స్టోక్స్ 108 రన్స్తో నెదర్లాండ్స్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. డేవిడ్ మలన్ 87, క్రిస్ వోక్స్ 51 రన్స్తో రాణించారు. నెదర్లాండ్స్ బౌలర్లో బాస్ డి లీడే 3 వికెట్లు పడగొట్టగా.. ఆర్యన్ దత్ 2,లోగాన్ వాన్ బీక్ 2, పాల్ వాన్ మీకెరెన్ ఒక వికెట్ తీశారు.