Home > క్రీడలు > యాషెస్ సిరీస్.. చివరికి యుద్ధంతో ముగిసింది

యాషెస్ సిరీస్.. చివరికి యుద్ధంతో ముగిసింది

యాషెస్ సిరీస్.. చివరికి యుద్ధంతో ముగిసింది
X

భారత్- పాకిస్తాన్ కు మ్యాచ్ కు ప్రపంచ వ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉంటుందో.. అంతే క్రేజ్ ఆస్ట్రేలియా- ఇంగ్లండ్ యాషెస్ సిరీస్ కు ఉంటుంది. ఈ సిరీస్ లో ఇరు జట్ల మధ్య యుద్ధ వాతావరణం కనిపిస్తుంది. ప్రతి సెషన్, ప్రతి బాల్ మధ్య హై టెన్షన్ ఉంటుంది. ఇటు ఆటగాళ్లతో పాటు.. స్టేడియంలో ఉన్న ప్రేక్షకుల్లో కూడా అంతే ఉత్సాహం కనిపిస్తుంది. ఈ క్రమంలో ఇంగ్లండ్ వేదికగా జరిగిన యాషెస్ 2023 సిరీస్ ముగిసింది. ప్రతి మ్యాచ్ లో కొత్త వివాదం, విమర్శల నడుమ ఐదు మ్యాచుల సిరీస్ ముగిసింది. 2-2 తో డ్రా అయింది. 384 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్.. 49 పరుగుల తేడాతో ఓడిపోయారు.

యుద్ధాన్ని తలపించిన చివరి మ్యాచ్ లో.. ఒకానొక టైంలో ఆసీస్ గెలుస్తుంది అనుకున్నారంతా. కానీ, ఇంగ్లండ్ బౌలర్ల అసాధారణ ప్రతిభతో.. అంతా తారుమారయింది. గెలుపు వాళ్ల వైపుకు మలుచుకున్నారు. ఆసీస్ ఓపెనర్లు డేవిడ్ వార్నర్(60), ఉస్మాన్ ఖవాజా(72) తొలి వికెట్ కు 140 పరుగుల భాగస్వామ్యాన్ని అందించినా.. తర్వాత వచ్చిన ఏ బ్యాటర్ క్రీజులో పాతుకుపోలేకపోయారు. స్టీవ్ స్మిత్(54), ట్రావిస్ హెడ్(43) పరుగులతో రాణించినా.. ఇంగ్లండ్ బౌలర్ల పోరాటం ముందు తలొగ్గక తప్పలేదు. కెరీర్ లో చివరి టెస్ట్ ఆడుతున్న స్టువర్ట్ బ్రాడ్ ఆఖరి బంతికి వికెట్ తీసి ఇంగ్లండ్ కు విజయాన్ని అందించాడు. తన కెరీర్ ను మధుర జ్ఞాపకంతో ముగించాడు. దీంతో ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ 2-2తో సమం అయింది.








Updated : 1 Aug 2023 12:41 PM GMT
Tags:    
Next Story
Share it
Top