Home > క్రీడలు > మూడో టెస్ట్ లో గెలుపు-యాషెస్ ఆశలను సజీవంగా నిలిపిన ఇంగ్లాండ్

మూడో టెస్ట్ లో గెలుపు-యాషెస్ ఆశలను సజీవంగా నిలిపిన ఇంగ్లాండ్

మూడో టెస్ట్ లో గెలుపు-యాషెస్ ఆశలను సజీవంగా నిలిపిన ఇంగ్లాండ్
X

ప్రతిష్టాత్మక యాషెస్ సీరీస్ లో ఇంగ్లాండ్ మొత్తానికి నిలబడింది. మూడో టెస్ట్ లో 3 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా మీద గెలిచింది. 2-1తో ఆస్ట్రేలియా ఆధిక్యాన్ని తగ్గించింది. ఈ టెస్ట్ మ్యాచ్ గెలవడం ద్వారా ఇంగ్లాండ్ కెప్టెప్ బెన్ స్టోక్ బారత్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ రికార్డ్ ను సమం చేశాడు.

ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా మధ్య జరిగే పోరు యాషెస్ సీరీస్. ఇరు దేశాలు దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా భావిస్తయి. దీనిలో గెలవడానికి చాల కష్టపడతాయి. మొత్తం ఐదు టెస్ట్ మ్యాచ్ ల సీరీస్ ఇది. ఇప్పటికి మూడు టెస్ట్ మ్యాచ్ లు జరిగాయి. ఇందులో 2 మ్యాచ్ లు ఆష్ట్రేలియా గెలవగా...మూడో మ్యాచ్ ఇంగ్లాండ్ చేజిక్కించుకుంది. మిడిలార్డర్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ 75 పరుగులు చేసి మ్యాచ్ ను గెలిపించాడు. మరో బ్యాటర్ వోక్స్ కూడా 32 పరుగులు చేసి బ్రీక్స్ ను తోడుగా నిలిచాడు. ఆస్ట్రేలియా బౌలర్ మిచెల్ స్టార్క్ 78 పరుగులకు 5 వికెట్లు తీసాడు.

ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ ను గెలిపించిన బ్రూక్ టెస్ట్ ల్లో అతి తక్కువ బంతుల్లో వెయ్యి పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డ్ నెలకొల్పాడు. ఇంతకు ముందు ఈ రికార్డ్ న్యూజిలాంగ్ బ్యాటర్ కొలిన్ గ్రాండ్ హోమ్ పేరు మీద ఉండేది. అయితే అతను 1140 బంతుల్లో వెయ్యి పరుగులు చేయగా బ్రూక్ కేవలం 1058 పరుగుల్లోనే చేశాడు. అలాగే అతి తక్కువ ఇన్నింగ్స్ ల్లో 1000 వెయ్యి పరుగుల చేసిన ఆటగాళ్ళ జాబితాలో కూడా బ్రూక్ 5వ స్థానాన్ని దక్కించుకున్నాడు.

మరోవైపు మూడో టెస్ట్ గెలవడం ద్వారా ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్ కూడా ప్రపంచ రికార్డ్ సృష్టించాడు. టెస్ట్ క్రికెట్ లో 250 ప్లస్ టార్గెట్ను ఎక్కువ సార్లు ఛేధించిన జట్టుకు కెప్టెన్ గా నిలిచాడు. 5సార్లు 250కు పైగా లక్ష్యాన్ని ఛేదించిన జట్టుకు బెన్ సారధ్యం వహించాడు. ఇంతకు ముందు ఈ రికార్డ్ భారత్ మాజీ కెప్టెన్ ఎంఎప్ ధోనీ పేరు మీద ఉండేది. ఇప్పుడు యాషెస్ సీరీస్ లో ఈ మూడో మ్యాచ్ తో బెన్ స్టోక్ దాన్ని బ్రేక్ చేశాడు. తరువాతి స్థానాల్లో బ్రియాన్ లారా, రికీ పాంటింగ్ లు ఉన్నారు. వీరిద్దరూ 3 సార్లు 250 లక్ష్యాన్ని ఛేదించారు.



Updated : 10 July 2023 8:53 AM IST
Tags:    
Next Story
Share it
Top