Home > క్రీడలు > కోహ్లీ గురించి మేం పెద్దగా ఆలోచిచట్లేదు: బెన్ స్టోక్స్

కోహ్లీ గురించి మేం పెద్దగా ఆలోచిచట్లేదు: బెన్ స్టోక్స్

కోహ్లీ గురించి మేం పెద్దగా ఆలోచిచట్లేదు: బెన్ స్టోక్స్
X

భారత్ టూర్ లో ఉన్న ఇంగ్లాండ్ జట్టు ప్రస్తుతం 5 టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ఆడుతుంది. ఇప్పటికే రెండు మ్యాచులు జరగగా 1-1తో సిరీస్ సమం అయింది. రేపు రాజ్ కోట్ వేదికగా జరగబోయే మూడో మ్యాచ్ కీలకం కానుంది. ఈ క్రమంలో ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ సంచలన వ్యాఖ్యలు చేశాడు టీమిండియాకు దూరమైన విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వ్యక్తిగత కారణాల వల్ల కోహ్లీ, గాయం కారణంగా రాహుల్ జట్టుకు దూరమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వీళ్లిద్దరు ఆడకపోవడం ఇంగ్లాండ్ కు మంచి విషయమే అనే అంశాన్ని బెన్ స్టోక్స్ కొట్టిపారేశాడు. వాళ్లిద్దరు ఆడినా, ఆడకపోయినా ఇంగ్లాండ్ కు ఎలాంటి నష్టం జరగదని చెప్పుకొచ్చాడు.

‘కోహ్లీ వ్యక్తిగత కారణాల వల్ల, రాహుల్ గాయం వల్ల జట్టును వీడారు. వాళ్లిద్దరు జట్టులో లేనంత మాత్రాన అది మాకు మేలు జరిగే విషయం అని, టీమిండియాకు జరిగే నష్టం అని మా జట్టు భావించడం లేదు. ఇలాంటి వాదనలు నాకు అసలే ఇష్టముండదు. ఈ సిరీస్ లో మా జట్టును ఇబ్బంది పెట్టే అంశాలు ఇంకా చాలా ఉన్నాయి. కోహ్లీ జట్టులో లేకపోవడానికి కొన్ని కారణాలు ప్రచారంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో మా జట్టు తరుపున అతనికి శుభాకాంక్షలు తెలుపుతున్నాము. కోహ్లీ గ్రౌండ్ లో ఉండాలని ప్రతీ ఒక్కరు కోరుకుంటారు. త్వరలోనే అతను మళ్లీ తిరిగి బరిలో దిగాలని ఆశిస్తున్నా’ అని బెన్ స్టోక్స్ అన్నాడు.




Updated : 14 Feb 2024 3:49 PM GMT
Tags:    
Next Story
Share it
Top