Home > క్రీడలు > కుర్రాళ్లు ఫెయిల్.. తల పట్టుకున్న బీసీసీఐ.. భవిష్యత్తులో ఎలా..?

కుర్రాళ్లు ఫెయిల్.. తల పట్టుకున్న బీసీసీఐ.. భవిష్యత్తులో ఎలా..?

కుర్రాళ్లు ఫెయిల్.. తల పట్టుకున్న బీసీసీఐ.. భవిష్యత్తులో ఎలా..?
X

‘టీమిండియా నుంచి మూడు, నాలుగు జట్లను సెలక్ట్ చేసి.. ప్రపంచంలో ఏ టోర్నీనైనా గెలిచొస్తాం’.. కొన్నేళ్ల క్రితం ఓ టీమిండియా కెప్టెన్ అన్న మాటలివి. ఐపీఎల్, దేశవాళిలో సత్తాచాటుతున్న ప్లేయర్లను చూసి బీసీసీఐ కూడా అంతే కాన్ఫిడెంట్ గా కనిపించింది. తీరా చూస్తే.. మెయిన్ టీంతో సహా, అన్ని జట్లు బొక్కబోర్లా పడుతున్నాయి. అనామక ప్లేయర్లలా.. కీలక సమయాల్లో చేతులెత్తుస్తున్నారు. ప్రస్తుతం విండీస్ తో జరుగుతున్న వన్డే సిరీస్ తో మరోసారి భారత క్రికెట్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. మొదటి వన్డేలో తక్కువ పరుగులకే విండీస్ ను ఆలౌట్ చేశారు. కుర్రాళ్లకు ఛాన్స్ ఇచ్చి సీనియర్ బ్యాటర్లు బెంచ్ పై కూర్చున్నారు. తీరాచూస్తే.. పీకల్లోతు కష్టాలు పడి చివరికి విజయం సాధించింది. రెండో వన్డేలో.. భారమంతా కుర్రాళ్లపై వేసి.. సినియర్లకు రెస్ట్ ఇచ్చారు. అయినా ఫలితం మారలేదు. టీమిండియా బ్యాటర్స్ బ్యాటింగ్ చేయడానికి కష్టపడ్డ పిచ్ పై.. విండీస్ బ్యాటర్లు సునాయసంగా బ్యాటింగ్ 6 వికెట్ల తేడాతో గెలిచారు.

ఈ రెండు మ్యాచుల్లో టీమిండియా ఫెల్యూర్ కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ లో పసి కూనలపై తేలిపోయిన ఆ జట్టే.. మేటి టీమిండియాకు చెమటలు పట్టిస్తోంది. దీంతో టీమిండియా వరల్డ్ కప్ ఆశలే కాదు.. భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకంగా మారింది. 90/0, 118/5, 181/10.. పటిష్టంగా కనిపించిన జట్టు.. చేతులెత్తేసింది. కనీసం ఏ ఒక్క బ్యాట్స్ మెన్ క్రీజులో నిలబడే ప్రయత్నం చేయలేదు. దీంతో టీంలో సీనియర్ల కొరత కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలాంటి సీనియర్లు జట్టుకు ఎంత అవసరమో మరోసారి రుజువైంది. కుర్రాళ్లతో ప్రయోగాలు చేసిన ప్రతిసారీ ఫెయిల్ అవుతూనే ఉంది బీసీసీఐ. వరల్డ్ కప్ కు ముందు జట్టుకు కావాల్సిన ప్లేయర్లు దొరుకుతారో లేదో తెలియదు కానీ, ఉన్న ప్లేయర్లు మాత్రం దూరమయ్యేలా కనిపిస్తోంది. వరల్డ్ కప్ కు ఇంకా రెండు నెలలు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో.. ఈసారైనా ప్రయోగాలు మాని.. జట్టును పూర్తిస్థాయిలో నిర్మించాలని అభిమానులు భావిస్తున్నారు.

Updated : 30 July 2023 11:29 AM GMT
Tags:    
Next Story
Share it
Top