Home > క్రీడలు > చెన్నై జట్టులో ఫాఫ్ డుప్లెసిస్.. కెప్టెన్గా బరిలోకి

చెన్నై జట్టులో ఫాఫ్ డుప్లెసిస్.. కెప్టెన్గా బరిలోకి

చెన్నై జట్టులో ఫాఫ్ డుప్లెసిస్.. కెప్టెన్గా బరిలోకి
X

సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్.. మళ్లీ చెన్నై జట్టులో చేరాడు. కెప్టెన్ గా అవతారం ఎత్తాడు. అయితే, ఇది ఐపీఎల్ లో కాదు.. మినీ ఐపీఎల్ లో. అగ్రరాజ్యం అమెరికా నిర్వహిస్తున్న మేజర్ లీగ్ క్రికెట్ టీ20 టోర్నీలో చెన్నై ఫ్రాంచేజీ.. టెక్సాస్ సూపర్ కింగ్స్ టీంను కొనుగోలు చేసింది. ఆ టీం తరుపున డుప్లెసిస్ ఆడనున్నాడు. ఐపీఎల్ లో ఆర్సీబీని ముందుండి నడిపించిన డుప్లెసిస్ పై నమ్మకం ఉంచి, అతనికి కెప్టెన్సీని కూడా ఇచ్చింది. ఈ విషయాన్ని టెక్సాస్ సూపర్ కింగ్స్ తన అధికారికి ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలిపింది.

ఇప్పటికే సౌతాఫ్రికా ప్రీమియర్ లీగ్ లో చెన్నై కొనుగోలు చేసిన జోబర్గ్ సూపర్ కింగ్స్ జట్టుకు డుప్లెసిస్ కెప్టెన్ గా ఉన్నాడు. జులై 13 నుంచి జూలై 30 వర​కు జరగబోయే ఈ టోర్నీలో చెన్నై తరుపున.. డుప్లెసిస్‌తో పాటు అంబటి రాయుడు, డ్వేన్ బ్రావో, మిచెల్ సాంట్నర్, డెవాన్ కాన్వే, డేవిడ్ మిల్లర్ ఆడనున్నారు.


Updated : 17 Jun 2023 6:06 PM IST
Tags:    
Next Story
Share it
Top